Begin typing your search above and press return to search.

క్రిస్మస్ పార్టీకి రాలేదు.. కోడికూరతో నువ్వు రా..

By:  Tupaki Desk   |   7 Jan 2020 6:06 AM GMT
క్రిస్మస్ పార్టీకి రాలేదు.. కోడికూరతో నువ్వు రా..
X
మహిళల మీద వేధింపులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. పని చేసే ప్రదేశం మొదలు పబ్లిక్ ప్లేస్ వరకూ ఆడోళ్లకు భద్రత అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. పని పాటా లేని పోరంబోకులు ఆడోళ్లను వేధిస్తున్నారంటే కాస్త అర్థం చేసుకోవచ్చు. కానీ.. అందరూ గౌరవించేస్థానాల్లో ఉన్నోళ్లు కూడా చేస్తున్న ఛీదర పనులు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి బయటకు వచ్చింది.

ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన కురిచేడు మండలంలోని పడమర వీరాయపాలెం అనే ఊరు ఒకటి ఉంది. ఆ గ్రామంలో పని చేసే వీఆర్ ఏ పట్ల.. మండల మేజిస్ట్రేట్ అయిన తహసీల్దార్ వ్యవహరించిన వైఖరి ఇప్పుడు సంచలనంగా మారింది. సదరు మహిళా వీఆర్ఏపై కన్నేసిన అతగాడు.. అదే పనిగా ఆమెను వేధిస్తున్నాడు.

పంటి బిగువున ఓర్చుకున్నా.. ఎంతకూ అర్థం చేసుకోని ఆ అధికారి మీద తాజాగా మహిళా అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి వయసున్న సదరు అధికారి సాటి ఉద్యోగి పట్ల దారుణంగా వ్యవహరించటం ఇప్పుడు అవాక్కు అయ్యేలా చేస్తోంది.

క్రిస్మస్ పండుగ వేళ తన ఇంట్లో ఏర్పాటు చేసిన విందుకు.. ఆపీసు సిబ్బందిని ఆహ్వానించింది బాధితురాలు. అందరూ వచ్చినా.. తహిసిల్దార్ మాత్రం రాలేదు. అప్పటి నుంచి కిస్మస్ పార్టీకి రాలేదు కదా.. కోడి కూర తీసుకొని నువ్వు వచ్చేయ్.. అంటూ అసభ్యంగా మాట్లాడటంతో పాటు.. వెనుక నుంచి వచ్చి కౌగిలించుకుంటూ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్లుగా సదరు అధికారిణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. ఈ ఉదంతంపై విచారణ జరుపుతున్నారు. అయితే.. తాను మహిళా ఉద్యోగిని పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదని.. తనను దెబ్బ కొట్టేందుకే ఇలా చేస్తుందంటూ సదరు అధికారి ఆరోపించటం గమనార్హం.