Begin typing your search above and press return to search.
తాజ్ మహల్ ‘షాజహాన్’ కట్టించలేదట.. ఇవిగో ఆధారాలు?
By: Tupaki Desk | 2 Oct 2022 12:30 AM GMTతాజ్ మహల్.. ఈ తెల్లటి పాలరాతి శిల్పం ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిచింది. చరిత్రను బట్టి చూస్తే.. ముంతాజ్ ప్రేమకు గుర్తుగా షాజహాన్ ఈ అందమైన సమాధిని ఆమె కోసం కట్టించాడని చరిత్ర చెబుతోంది. కానీ చరిత్రలో ఇది తప్పు అని.. తాజ్ మహల్ ను షాజహాన్ కట్టించలేదని కొందరు మేధావులు వాదిస్తున్నారు. వాదించడమే కాదు ఆధారాలు చూపిస్తామంటున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టుకు ఎక్కారు.
తాజ్ మహల్ అసలు చరిత్రపై అధ్యయనానికి ఓ నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ పిటీషన్ దాఖలైంది. దీని గురించి స్పష్టత ఇచ్చి వివాదాలకు తెరదించాలని కోరింది. దీని చరిత్ర గురించి స్పష్టతనిచ్చి వివాదాలకు తెరదించాలని కోరింది. దీనిని షాజహాన్ నిర్మించినట్లు చెప్తున్నప్పటికీ శాస్త్రీయ ఆధారాలేవీ లేవని పేర్కొంది.
డాక్టర్ రజినీ్ సింగ్ అనే వ్యక్తి తాజాగా తాజ్ మహల్ అసలు చరిత్రను నిర్ధారించాలని సుప్రీంకోర్టులో ఓ పిటీషన్ దాఖలు చేశారు. ఇదే అభ్యర్థనతో ఆయన దాఖలు చేసిన పిటీషన్ ను అలహాబాద్ హైకోర్టు మే 12న తోసిపుచ్చింది. అడ్వేకేట్ శ్రీవాస్తవ తాజాగా సుప్రీంకోర్టుకు ఎక్కారు.
పిటీషన్ గతంలో ఎన్సీఈఆర్టీకి తాజ్ మహల్ ఎవరు కట్టారన్న దానిపై సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేశారు. దీనికి ఎన్సీఈఆర్టీ మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య కోసం తాజ్ మహల్ ను నిర్మించాడన్నదానికి ప్రాథమిక ఆధారాలు లేవని తెలిపింది.
అదే విధంగా ఆర్కియాలిజికల్ ఆప్ ఇండియా కూడా సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేసినా సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదు. షాజహాన్ తన భార్య ముంతాజ్ కోసం తాజ్ మహల్ ను 1631 నుంచి 1653 వరకూ 22 ఏళ్ల పాటు నిర్మించినట్లు చెప్తున్నప్పటికీ తగిన శాస్త్రీయ ఆధారాలు లేవని పిటీషనర్ ఆరోపించారు.
మొఘల్ దురాక్రమణదారులు, దండయాత్ర చేసిన వారు నిర్మించిన కట్టడాలను చారిత్రక కట్టడాలుగా ప్రకటించడాన్ని తప్పుపడుతూ పిటీషన్ హైకోర్టుకు ఎక్కారు. మరి ఆధారాలు లేని తాజ్ మహల్ ను ఎవరు కట్టారన్న దానిపై సుప్రీంకోర్టు ఏం తేలుస్తుందన్నది ఆసక్తి రేపుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.