Begin typing your search above and press return to search.
తాజ్ మహల్ పేరును యోగీ మార్చేస్తారట!
By: Tupaki Desk | 15 March 2021 4:01 AM GMTప్రపంచ ప్రఖ్యాతి గాంచి, అరుదైన వింతల్లో ఒకటిగా పేరుగాంచిన ఆగ్రాలోని తాజ్ మహల్ పేరును బీజేపీ సర్కారు మార్చనుందట! సాక్షాత్తూ బీజేపీ ఎమ్మెల్యే ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆగ్రాలోని తాజ్ మహల్ ను ముఖ్యమంత్రి యోగీ రాజ్యంలో మార్పు జరిగి తీరుతుందని వ్యాఖ్యానించారు సదరు ఎమ్మెల్యే!
ఉత్తర ప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ ఈ మేరకు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాజ్ మహల్ ఒకప్పుడు శివాలయంగా ఉండేదని అన్నారు. అందువల్ల తాజ్ మహల్ పేరును రామ్ మహల్ లేదా కృష్ణ మహల్ గా మార్చుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంతేకాకుండా.. సీఎం యోగీ ఆదిత్యనాథ్ ను శివాజీ వారసుడిగా చెప్పుకొచ్చారు సదరు ఎమ్మెల్యే. సమర్ గురువైన రామ్ దాస్ శివాజీని దేశానికి అందించినట్టుగానే.. గోరఖ్ నాథ్ బాబా యోగీని యూపీకి అందించారని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నగరాల పేర్లు మార్చుతామంటూ చెబుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే.. ఫైజాబాద్ ను శ్రీ అయోధ్యగా మార్చిన విషయం తెలిసిందే. హైదరాబాద్ పేరు కూడా మారుస్తామంటూ నాయకులు మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజ్ మహల్ పేరును కూడా మారుస్తామని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. అయితే.. దీనిపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. పాలనలోని లోపాలపై జనం దృష్టి పడకుండా.. ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శిస్తున్నాయి.