Begin typing your search above and press return to search.
వారి పై చర్యలు తీసుకోండి : స్పీకర్ తమ్మినేని
By: Tupaki Desk | 13 Dec 2019 9:08 AM GMTఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల లో గురువారం ఒక వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. గత ఐదు రోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మీడియాపై నియంత్రణ విధిస్తూ తీసుకొచ్చిన జీవో పై నిన్న టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. దీనిపై నిరసన వ్యక్తం చేయడానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు , టీడీపీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీల తో కలిసి అసెంబ్లీ కి ఒక ర్యాలీ లాగా వచ్చారు.
దీనితో అక్కడ ఉన్న మార్షల్స్ వారిని అడ్డుకోవడం జరిగింది. మార్షల్స్ వారిని అడ్డుకోవడం తో కోపోద్రిక్తుడైన చంద్రబాబు , తనయుడు లోకేష్ బాబు మార్షల్స్ పై తీవ్ర స్థితిలో ధ్వజమెత్తారు. తీవ్రమైన పదజాలంతో వారిని దూషించారు. ఈ అధికార పార్టీ సభ్యులు చంద్రబాబు వ్యవహార శైలి పై నిరసన వ్యక్తం చేసి , అయన పై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ని కోరారు. దీనితో స్పీకర్ ..జరిగిన దానికి చంద్రబాబు ని విచారం వ్యక్తం చేయమనగా ..దానికి అయన ఒప్పుకో లేదు అలాగే , నాకు అక్కడ అవమానం జరిగింది దానికి ఎవరు విచారం వ్యక్తం చేస్తారో చెప్పమనండి అప్పుడు నేను విచారం వ్యక్తం చేస్తాను అని అన్నారు.
అలాగే వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీని జైలుగా మార్చిందని చంద్రబాబు ఆరోపించడం తో శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గనా రెజేంద్రనాథ్ జోక్యం చేసుకుని, అసెంబ్లీ మరియు దాని ద్వారాలను టిడిపి ప్రభుత్వం నిర్మించిందని, ఇప్పుడు మళ్లీ ఆయనే అసెంబ్లీని జైలు అని పిలుస్తున్నారని చెప్పారు. దీనితో అసెంబ్లీని గేట్ క్రాష్ చేయడానికి ప్రయత్నించిన బయటి వ్యక్తులను గుర్తించి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని , అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఏపీ అసెంబ్లీ భద్రతా అధికారులను ఆదేశించారు.