Begin typing your search above and press return to search.

ఆ దేశం ఫాలో అయిన ట్రేసింగ్ ను స్ఫూర్తిగా తీసుకోండి మోడీ?

By:  Tupaki Desk   |   2 May 2021 5:30 PM GMT
ఆ దేశం ఫాలో అయిన ట్రేసింగ్ ను స్ఫూర్తిగా తీసుకోండి మోడీ?
X
చూస్తుండగానే కేసుల సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. నెల క్రితం రోజుకు 40వేల కంటే తక్కువగా కేసులు నమోదైన స్థాయికి తాజాగా రోజుకు నాలుగు లక్షల కేసులు నమోదవుతున్న వైనానికి ఏ మాత్రం పొంతన లేదన్నది మర్చిపోకూడదు. మొదటి వేవ్ తో పోలిస్తే.. సెకండ్ వేవ్ వేళ అటు ప్రభుత్వం.. ఇటు ప్రజలు ఎవరికి వారు పోటాపోటీగా కరోనాకు చెక్ పెట్టే నిబంధనల్ని.. నియమాల్ని పాటించకుండా చాలా పెద్ద తప్పు చేశారని చెప్పాలి. ఇదే.. ఈ రోజు ఇంత భారీగా కేసులు నమోదు కావటానికి కారణంగా చెప్పాలి.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు.. మరిన్ని చర్యల్ని చేపడితే తప్పించి.. పరిస్థితి అదుపులోకి రాదన్న మాట వినిపిస్తోంది. ప్రపంచంలో ఇప్పటివరకు మూడు.. నాలుగుదేశాలు మాత్రమే మాస్కు లేకుండా ప్రజలు బయటకు తిరగొచ్చన్న మాటను చెప్పారు.అలాంటి దేశాల్లో న్యూజిలాండ్ ఒకటి.ఆ దేశంలో వైరస్ లక్షణాల్ని గుర్తించే విషయంలో అనుసరించిన విధానం అందరి ప్రశంసలు పొందింది. అంతేకాదు.. వ్యక్తులకు కరోనా లక్షణాలు లేనంత మాత్రాన వైరస్ సోకలేదని చెప్పలేమని తొలిసారి ప్రపంచానికి చెప్పిన దేశం న్యూజిలాండ్ గా చెప్పక తప్పదు.

కరోనా కాంటాక్ట్ ట్రేసింగ్ చర్యల్ని ఆ దేశం యుద్ధ ప్రాతిపదికన సేకరించింది. ఒక్కో కేసులో తక్కువలో తక్కువ 300 నుంచి 500 మంది వివరాల్ని సేకరించారు. అలా గుర్తించిన ప్రతి ఒక్క బాధితుడికి అవసరమైన వైద్య చికిత్సల్ని అందించారు. అవసరమైన మందుల్ని..వైద్య సామాగ్రిని అందించటం ద్వారా వైరస్ కు చెక్ చెప్పారు. న్యూజిలాండ్ అనుసరించిన నాలుగు దశల ట్రేసింగ్ విధానాన్ని.. కట్టడి విధానాన్ని అందరూ పాటించటం మంచిది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దేశమంతా పాటించాల్సిన అవసరం ఉంది.

- వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న వేళ.. ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రావొద్దు.. మాస్కు ధరించాలి. లేదంటే ఫైన్
- వైరస్ వ్యాప్తికి చెక్ చెప్పేందుకు వీలుగా థియేటర్లు.. బహిరంగ ప్రదేశాల్లో తిరగటాన్ని నిషేధించాలి. అవసరం ఉంటే తప్పించి బయటకు రాకూడదు. ఈ సమయంలోనూ మాస్కు ధరించటం తప్పనిసరి.
- వైరస్ నమోదు తక్కువ అవుతున్న వేళ.. మాస్కులు పెట్టుకొని షాపింగ్ మాల్స్ కు వెళ్లొచ్చు. కాకుంటే.. భౌతిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలి.
- వైరస్ కేసులు పూర్తిగా తగ్గిపోయిన దశలో.. సాధారణ జీవితాన్నిగడిపే వీలుంది.అయితే.. మన లాంటి దేశంలో ఇలాంటి పరిస్థితి రావటానికి చాలా కాలం పడుతుందన్నది మర్చిపోకూడదు. అందుకే మరింత అప్రమత్తంగా ఉండాలి.