Begin typing your search above and press return to search.
ఆ సీఎంను సమోసాలు బాగా లాగించమన్న రాష్ట్రపతి
By: Tupaki Desk | 9 April 2015 8:57 AM GMTరాష్ట్రాల ముఖ్యమంత్రులు.. రాష్ట్రపతి మధ్య సంబంధాలు సాధారణంగా చాలా పరిమితంగా ఉంటాయి. అంత చనువు కూడా ఉండదు. కానీ.. అందుకు భిన్నంగా చోటు చేసుకున్న ఈ సరదా ఘటన కాస్త ఆసక్తిని రేకెత్తించేదే.
రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో అత్యంత ఉన్నతమైన రాష్ట్రపతి కుర్చీలో కూర్చునే వ్యక్తులు సహజంగా బిగుసుకుపోతుంటారు. తమ పరిధిని దాటి రావటానికి పెద్దగా ఇష్టపడరు. చనువుగా ఒక మాట కూడా మాట్లాడరు. అలాంటి వాటికి భిన్నంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వ్యవమరించటం విశేషం. విశేష రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిగా పేరొందిన ప్రణబ్‌లోని రాజకీయ నేత నిద్ర లేచారో ఏమో కానీ.. కాస్తంగా సరదాగా.. చనువుగా ఒక ముఖ్యమంత్రితో చేసిన వ్యాఖ్య చూపరులను ఆకట్టుకుంటోంది.
పద్మ పురస్కారాల సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు. ఆయన దగ్గరకు రాష్ట్రపతి ప్రణబ్ వచ్చిన సమయంలో కేజ్రీ సమోసాలు తింటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ కాస్తంత సరదా వ్యాఖ్యలు చేశారు. సమోసాలు తింటున్న కేజ్రీని చూసిన రాష్ట్రపతి.. సమోసాలు తక్కువ తింటున్నారే.. కాస్త గట్టిగా లాగించండి.. మీ ఆరోగ్యానికి ఏమీ కాదంటూ వ్యాక్యానించారు. దీనికి సీఎం కేజ్రీ నవ్వుతో బదులిచ్చారు.
ఈ మధ్యకాలంలో ఆరోగ్యం బాగోలేక.. అరవింద్ కేజ్రీవాల్ బెంగళూరులోని ప్రకృతి చికిత్స చేయించుకోవటం తెలిసిందే. ఈ ప్రకృతి చికిత్సాలయం గురించి కేజ్రీవాల్‌కు ప్రధానమంత్రి మోడీ సలహా ఇవ్వటం తెలిసిందే.