Begin typing your search above and press return to search.

టీడీపీ ఎమ్మెల్యేను తెచ్చుకొని.. అక్క‌డ సీట్లు ఓడిపోయారు!

By:  Tupaki Desk   |   13 April 2021 1:30 AM GMT
టీడీపీ ఎమ్మెల్యేను తెచ్చుకొని.. అక్క‌డ సీట్లు ఓడిపోయారు!
X
విజ‌యాలు వ‌చ్చిన‌ప్పుడు లోపాలు పెద్ద‌గా చ‌ర్చ‌కు రావు. కానీ.. గెలుపుతో మురిసిపోకుండా.. లోపాల‌ను స‌రిదిద్దుకున్న‌ప్పుడే భ‌విష్య‌త్ స‌వాళ్ల‌ను అధిగ‌మించ‌డం సాధ్య‌మ‌వుతుంది. ఇప్పుడు వైసీపీకి ఈ సూచ‌న అత్య‌వ‌స‌రంగా క‌నిపిస్తోంది. ఇటీవ‌ల ఏపీలో జ‌రిగిన‌ మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో వైసీపీ అఖండ విజ‌యం సాధించింది. తొంభై శాతానికి పైగా స్థానాలు గెలుచుకొని స‌త్తాచాటింది. కానీ.. కొన్ని చోట్ల ఆ పార్టీకి గ‌ట్టి దెబ్బ త‌గిలింది.

రాష్ట్రానికి కార్య‌నిర్వాహ‌క రాజ‌ధానిగా ప్ర‌క‌టించిన విశాఖ‌లో అలాంటి ఫ‌లిత‌మే న‌మోదైంది. వైజాగ్ టౌన్ లోని నాలుగు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ నాలుగు గెలిచింది. వైసీపీ ఒక్క సీటు కూడా గెల‌వ‌లేదు. ఇటీవ‌ల జ‌రిగిన గ్రేట‌ర్ విశాఖ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల వేళ ఎమ్మెల్యే అండ ఉండాల‌నే ఉద్దేశంతో వాసుప‌ల్లి గ‌ణేష్ కుమార్ ను ట‌చ్ లోకి తెచ్చుకున్నారు.

ఆయ‌న‌.. రాలేదుగానీ, త‌న కొడుకుల‌కు వైసీపీ కండువా క‌ప్పించారు. తాను మాత్రం పార్టీ మార‌లేద‌ని పైకి చెప్పుకున్నా.. జ‌నాల‌కు అర్థం కాకుండా ఉంటుందా? వాళ్లు ఏం చేయాలో అదే చేశారు. అక్కడ ఉన్న 13 వార్డులలో.. ఎమ్మెల్యే వ‌ర్గానికే బీ ఫామ్స్ కూడా ఇచ్చారు. కానీ.. అక్క‌డ వైసీపీ గెలిచిన‌వి కేవ‌లం 5 వార్డులు మాత్ర‌మే! మిగిలిన వార్డుల‌లో వైసీపీ దారుణంగా ఓడిపోయింద‌ని అక్క‌డి నేత‌లు చెబుతున్నారు.

ఇలా ఓడిపోవ‌డానికేనా ఎమ్మెల్యేను తెచ్చుకున్న‌ది? అని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేను తెచ్చుకొని వైసీపీని దెబ్బ కొట్టించుకోవ‌డం మిన‌హా ఏం ఒరిగింద‌ని అంటున్నారు. చంద్ర‌బాబు నాయుడు ఇలా చేసే క‌దా.. నిండా మునిగిందని అంటున్నారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేను తెచ్చుకోవ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఏమీ లేక‌పోగా.. న‌ష్టాలు వ‌చ్చాయ‌ని అంటున్నారు. మునిసిప‌ల్‌ ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డం ఒక‌టైతే.. గ్రూపు రాజ‌కీయాలు కూడా పెరిగాయ‌ని చెబుతున్నారు.

ప్ర‌స్తుతం అక్క‌డ వైసీపీలో మొత్తం 5 గ్రూపులు త‌యార‌య్యాయ‌ని చెబుతున్నారు కార్య‌క‌ర్త‌లు. టీడీపీ నాయ‌కుల వ‌ల్ల కొత్త గుంపు త‌యారైంది త‌ప్ప‌, పార్టీకి మేలు జ‌రిగింది ఏమీ లేద‌ని అంటున్నారు. ఈ ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగితే.. రాబోయే రోజుల్లో ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని హెచ‌చ‌రిస్తున్నారు. ఇప్ప‌టికైనా అధిష్టానం స్పందించి, త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు.