Begin typing your search above and press return to search.

కీల‌క నిర్ణ‌యం: స‌ర్వీసు చార్జి వేస్తే జైలే

By:  Tupaki Desk   |   10 July 2017 5:00 AM GMT
కీల‌క నిర్ణ‌యం: స‌ర్వీసు చార్జి వేస్తే జైలే
X
కేంద్రం ఒక కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. హోట‌ళ్ల‌కు.. రెస్టారెంట్ల‌కు వెళ్లిన‌ప్పుడు.. స‌ర్వీస్ చార్జి అంటూ వీపు వాయించేస్తుంటారు. స‌ర్వీసు చార్జి అన్న‌ది వినియోగ‌దారులు త‌న‌కు తానుగా న‌చ్చి..మెచ్చి ఇచ్చేది. కానీ.. అలాంటిదేమీ లేకుండా.. బిల్లులోనే స‌ర్వీసు ట్యాక్సుతో పాటు స‌ర్వీసు చార్జి వేసేస్తుంటారు. అయితే.. ఇప్పుడా స‌ర్వీసు చార్జి మీద కేంద్రం తాజాగా మ‌రింత స్ప‌ష్ట‌త ఇచ్చింది.

జీఎస్టీ అమ‌ల్లోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. స‌ర్వీస్ చార్జ్ ను వినియోగ‌దారుడి ఇష్ట‌పూర్వ‌కంగా తీసుకోవాలే కానీ బిల్లులో వేసే ఛాన్సే లేద‌ని తేల్చేసింది. ఒక‌వేళ‌.. త‌ప్ప‌నిస‌రిగా స‌ర్వీస్ చార్జ్ విధిస్తామ‌ని చెప్పే హోట‌ల్‌.. రెస్టారెంట్ యాజ‌మాన్యాల‌కు జైలు త‌ప్ప‌ద‌ని స్ప‌ష్టం చేసింది.

ఒక‌ర‌కంగా స‌ర్వీసు చార్జ్ అన్న‌ది టిప్ తో స‌మాన‌మ‌ని.. వినియోగ‌దారుడికి న‌చ్చి ఇచ్చే ఫ‌ర్లేదు కానీ.. దాని కోసం ఒత్తిడి చేయ‌రాద‌న్న మార్గ‌ద‌ర్శ‌కాలు స్ప‌ష్టంగా ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. ఏదైనా హోట‌ల్‌.. రెస్టారెంట్ స‌ర్వీసు చార్జ్‌ ను బ‌ల‌వంతంగా వ‌సూలు చేసేలా ఒత్తిడి తెస్తే.. స‌ద‌రు హోట‌ల్‌.. రెస్టారెంట్ పై వినియోగ‌దారుల కోర్టును ఆశ్ర‌యించ వ‌చ్చ‌ని వినియోగ‌దారుల వ్య‌వ‌హారాల శాఖ కార్య‌ద‌ర్శి అవినాశ్ కె.శ్రీవాస్త‌వ వెల్ల‌డించారు.

ఏప్రిల్ లోనే ప్ర‌భుత్వం మార్గ‌ద‌ర్శ‌కాల్ని జారీ చేసింద‌ని.. అయిన‌ప్ప‌టికీ ఇంకా కొంద‌రు స‌ర్వీసు చార్జి వ‌సూలు చేస్తున్న‌ట్లు చెప్పారు. అలా వ‌సూలు చేయ‌టం చ‌ట్ట‌వ్య‌తిరేకంగా అభివ‌ర్ణించిన శ్రీవాస్త‌వ ప్ర‌క‌ట‌న‌కు భిన్న‌మైన వాద‌న‌ను వినిపిస్తోంది నేష‌న‌ల్ రెస్టారెంట్ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియా. స‌ర్వీసు చార్జిని వ‌సూలు చేయ‌టం.. చ‌ట్టాన్ని అతిక్ర‌మించిన‌ట్లు ఎంత మాత్రం కాద‌ని.. ఎన్ఆర్ఏఐ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ ప్ర‌కుల్ కుమార్ చెబుతున్నారు. మార్గ‌ద‌ర్శ‌కాలు ఎప్ప‌టికీ చ‌ట్టాలు కావ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేస్తున్నారు. ప‌ర‌స్ప‌ర విరుద్ధంగా ఉన్న ప్ర‌క‌ట‌న‌లు జ‌నాల్ని క‌న్ఫ్యూజ్‌కు గుర‌య్యేలా చేస్తున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.