Begin typing your search above and press return to search.

ద‌య‌న్న‌కు చిక్కులు అన్నిఇన్ని కావుగా!

By:  Tupaki Desk   |   18 Sep 2018 5:13 AM GMT
ద‌య‌న్న‌కు చిక్కులు అన్నిఇన్ని కావుగా!
X
సీనియ‌ర్ నాయ‌కుడు.. సుదీర్ఘ కాలం తెలుగుదేశం పార్టీలో ఉండి.. ఆ మ‌ధ్య‌న టీఆర్ఎస్‌లో చేరిన వ‌రంగ‌ల్ జిల్లా నాయ‌కులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుకు ఇప్పుడు కొత్త క‌ష్టం వ‌చ్చింది. తాజా మాజీ అయిన ఆయ‌నకు పాల‌కుర్తి టికెట్ ఇస్తూ కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్నారు.

అయితే.. ఎర్ర‌బెల్లిని పాల‌కుర్తికి బ‌దులుగా వ‌రంగ‌ల్ ఈస్ట్ నుంచి పోటీ చేయాల‌ని.. త‌న‌కు పాల‌కుర్తిలో పోటీ చేసే అవ‌కాశం ఇవ్వాలంటూ టీఆర్ ఎస్ ఉమ్మ‌డి జిల్లా అధ్యక్షుడు త‌క్క‌ళ్ల‌ప‌ల్లి ర‌వీంద‌ర్ రావు కోరుతున్న వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. డిమాండ్ చేస్తున్న‌ట్లు కాకుండా.. రిక్వెస్ట్ గా అడుగుతున్న వైనం ఎర్ర‌బెల్లికి ఇబ్బందిక‌రంగా మారింది.

తాజాగా ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఎర్ర‌బెల్లి వ‌రంగ‌ల్ ఈస్ట్‌ కు ఎలా సూట్ అవుతారో చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. 2004 నుంచి 2014 వ‌ర‌కు ఉద్య‌మ‌కారులు అణిచివేత‌కు గురి అవుతున్నార‌ని.. వారిని గుర్తించాల్సిన బాధ్య‌త ఉందంటున్నారు.

ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన నేత‌లు ఉద్య‌మ‌కారుల్ని క‌డుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన అవ‌స‌రం ఉందంటున్నారు. పెద్ద ఎత్తున ఉద్య‌మ‌కారులు కేసీఆర్‌ ను క‌లిసి.. ఆయ‌న పాదాల‌కు మొక్కైనా టికెట్ తెచ్చుకునే ప్ర‌య‌త్నం చేస్తామ‌ని చెప్పారు. ఇదిలా ఉంటే.. ఎర్ర‌బెల్లిని పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గాన్ని మార్చుకోవాల‌న్న విన్న‌పాన్ని తెర‌పైకి తీసుకొస్తూ.. చిత్ర‌మైన వాద‌న‌ను వినిపిస్తున్నారు.

వ‌రంగ‌ల్ ఈస్ట్ లో కానీ ఎర్ర‌బెల్లి పోటీ చేస్తే శ‌త్రుశేషాన్ని తీర్చుకునే అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతున్నారు. ఆగ‌ర్భ రాజ‌కీయ శ‌త్రువుపై పోటీ చేస్తే బాగుంటుంద‌న్న మాట‌ను త‌క్క‌ళ్ల‌ప‌ల్లి చెబుతున్నారు. ఎర్ర‌బెల్లి కానీ బ‌రిలోకి దిగుతాన‌ని చెబితే అక్క‌డే ఉన్న గుండు సుధారాణి.. మేయ‌ర్ న‌రేంద‌ర్ తో పాటు ప్ర‌త్య‌ర్థులంతా ఎర్ర‌బెల్లికి సాయంగా నిలుస్తార‌ని చెబుతున్నారు. మ‌రి.. ఈ విన్న‌పాల‌పై ఎర్ర‌బెల్లి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.