Begin typing your search above and press return to search.

ఒక్కసారి తలాక్ చెప్పినా విడాకులేనంట

By:  Tupaki Desk   |   8 Feb 2016 6:18 AM GMT
ఒక్కసారి తలాక్ చెప్పినా విడాకులేనంట
X
డిజిటల్ యుగంలో కూడా జమానా నాటి పాత పద్ధతులే అనుసరిస్తామని చెప్పటం.. మా రూల్ బుక్ లో అలానే ఉంది కాబట్టి మేమూ అలానే ఉంటామనటాన్ని అందరూ వ్యతిరేకిస్తారు. మరి.. అలాంటి మాటల్నే చెప్పే ముస్లిం లా బోర్డును ప్రశ్నించే వారు.. నిలదీసే వారు.. ఇలా ఎందుకు ఉండాలి? మనం ఎందుకు మారకూడదు? అని ప్రశ్నించే వారు.. నిలదీసే వారు.. హక్కుల కోసం మాట్లాడే వారు కనిపించరు. కొన్ని ఇబ్బందులు కారణంగా మైనార్టీలు ఇలాంటి విషయాల మీద మాట్లాడాలని ఉన్నా మాట్లాడకపోవచ్చు. కానీ.. అపర మేధావులుగా ప్రపంచంలోని ప్రతి సమస్య మీదా స్పందించే కారణ జన్ములు కూడా మౌనంగా ఉండటం.. చైతన్యానికి ప్రతిరూపమని చెప్పుకొనే సోకాల్డ్ లౌకికవాదులు ఎందుకు పెదవి విప్పరో అర్థం కాదు.

ముస్లింల చట్టం ప్రకారం భర్తకు భార్య విడాకులు ఇవ్వాలంటే అదో పెద్ద ప్రొసీజర్. అదే సమయంలో భార్యకు భర్త విడాకులు ఇవ్వాలంటే తలాక్ అన్న మాటను మూడుసార్లు అంటే చాలు.. విడాకులు ఇచ్చేసినట్లే. అప్పుడెప్పుడో పెట్టిన ఈ రూల్ ఇప్పటికి సాగిపోతోంది. దీన్ని తప్పు పట్టే వారే కనిపించరు. చివరకు ఈ ఇష్యూ మీద ధైర్యం చేసి ఒకరు ముందుకు రావటం.. సుప్రీంకోర్టు దృష్టికి రావటంతో.. ఈ వైఖరి మీద మీ అభిప్రాయం చెప్పాలంటూ ముస్లిం లా బోర్డును సుప్రీం అడిగింది.

దీనికి తాజాగా సదరు బోర్డు మాట వింటే కంగుతినాల్సిందే. భార్యకు భర్త విడాకులు ఇవ్వాలంటూ మూడుసార్లు కూడా తలాక్ చెప్పాల్సిన అవసరం లేదని.. ఒక్కసారి తలాక్ అంటే సరిపోతుందని చెప్పటం ఒక విశేషమైతే..రాజ్యాంగం తమకిచ్చిన మత విశ్వాసాల పరిరక్షణ హక్కు ప్రకారం.. స్కైప్.. వాట్స్ అప్.. ఫేస్ బుక్ ద్వారా కూడా తలాక్ చెప్పొచ్చని స్పష్టం చేయటం గమనార్హం.

అయినా.. తలాక్ గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదని.. విడాకుల తర్వాత వారేమీ ఒక గదిలో మగ్గిపోవాల్సిన అవసరం లేదని.. చక్కగా మరొకరిని వివాహం చేసుకొని జీవితం గడపవచ్చంటూ బోర్డు సభ్యులు మహమ్మద్ అబ్దుల్రాహుల్ ఖురేషీ వ్యాఖ్యలు వింటే షాక్ తినాల్సిందే. వైవాహిక బంధాన్ని మూడు అక్షరాల్లో తేల్చేయటం.. ఆ తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోవటం లాంటివి చూసినప్పుడు.. ఎంత మత విశ్వాసం అయితే.. మనిషి విశ్వాసాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోరన్న అభిప్రాయం కలగక మానదు. మరి.. దీనిపై సుప్రీం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.