Begin typing your search above and press return to search.
మంత్రి వారసుడు టాలీవుడ్ మీట్ అండ్ గ్రీట్
By: Tupaki Desk | 3 April 2019 4:34 PM GMTతెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కుమారుడు.. యువ నాయకుడు సాయికిరణ్ యాదవ్ `టాలీవుడ్ మీట్ అండ్ గ్రీట్` ప్రస్తుతం హాట్ టాపిక్. మంత్రి గారి వారసుడు ప్రత్యేకించి సినీపరిశ్రమ పెద్దల్ని ఆహ్వానించి నేటి సాయంత్రం హైదరాబాద్ పార్క్ హయత్ లో టీ పార్టీ ఇవ్వడం ఆసక్తి రేకెత్తించింది. తన తండ్రికి టాలీవుడ్ నుంచి బ్లెస్సింగ్స్ అందినట్టుగానే తనకూ ఆశీస్సులు కావాలని శ్రీనివాస యాదవ్ ఈ మీట్ & గ్రీట్ లో కోరారు.
యువ నాయకుడు సాయికిరణ్ యాదవ్ మాట్లాడుతూ -``నాన్నగారు నాలుగు సార్లు మంత్రి అయ్యారు. రాజకీయాలతో పని లేకుండా నేను ఈ చిన్న ఏజ్ లో ఎంతో లగ్జరీగా బతకొచ్చు. కానీ నా ఆలోచన వేరుగా ఉంది. నాన్నగారిలా ప్రజా సేవలో నిమగ్నమవ్వాలని ఉంది. అలాగే హైదరాబాద్ పేరును అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేలా ఇతర దేశాల మెట్రో నగరాలకు తలమానికంగా - వరల్డ్ ది బెస్ట్ గా నిలిచేలా అభివృద్ధి చేయాలన్న తపన నాలో ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హైదరాబాద్ కి ఎంతో చేశారు. కరెంట్ సమస్య - నీళ్ల సమస్య లేకుండా చేయగలిగారు. ట్రాఫిక్ పరమైన సమస్యలు లేకుండా అన్నిరకాల చర్యలు తీసుకున్నారు. ఇంకా ఈ నగరం ట్రాఫిక్ ఫ్రీ నగరంగా మార్చాల్సి ఉంది. నిరంతరం ప్రజా సేవలో ఉండాలని ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఓటర్ల దీవెనలు కావాలి`` అని అన్నారు.
ఈ కార్యక్రమంలో అతిధులు మాట్లాడుతూ.. సినిమాటోగ్రఫీ మంత్రిగా తలసాని శ్రీనివాస యాదవ్ సినీపరిశ్రమకు ఎంతో చేశారు. ఆయన రాజకీయ వారసుడు సాయికిరణ్ పరిశ్రమ వర్గాలకు ఎంతో కాలంగా సుపరిచితుడు. ప్రజా సేవ చేయడం కోసం చాలా చిన్న వయసులో ఎంపీగా పోటీ చేస్తున్నారు. అతడు తప్పనిసరిగా విజేతగా నిలుస్తారు..అని పరిశ్రమ తరపున ఆశీస్సులు అందించారు.