Begin typing your search above and press return to search.
చిక్కడు దొరకడన్నట్లుండే తలసాని తొలిసారి ఆ మాటలతో దొరికేశారా?
By: Tupaki Desk | 19 Feb 2022 6:30 AM GMTతెలంగాణ రాష్ట్రంలో చాలామంది మంత్రులు ఉన్నా.. మిగిలిన వారికి భిన్నమైన ఛరిష్మా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సొంతం. కేసీఆర్ తో సన్నిహితంగా ఉండటం అంటే.. పులి మీద స్వారీగా అభివర్ణిస్తారు. అలాంటిదే ఏడేళ్లుగా.. ఎలాంటి ప్రాధాన్యత తగ్గకుండా.. ఎప్పటిలానే తగిన ప్రాధాన్యతను కంటిన్యూ అవుతున్న ఏకైన మంత్రిగా తలసానిని చెప్పొచ్చు.
మొన్నటికి మొన్న ప్రధాని నరేంద్ర మోడీపై గుర్రుతో.. అనారోగ్యంతో ఆయన్ను కలవటానికి వెళ్లని ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర ప్రతినిధిగా ఎంపిక చేయాల్సి వచ్చినప్పుడు.. కొడుకు కేటీఆర్ కానీ.. మేనల్లుడు హరీశ్ కానీ కాకుండా మంత్రి తలసానిని ఎంపిక చేసుకున్న తీరు చూస్తే.. తెలంగాణ సీఎం దగ్గర ఆయనకున్న ప్రాధాన్యం ఏపాటిదన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.
తాజాగా ఒక ప్రముఖ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ సందర్భంగా తలసాని అడ్డంగా బుక్ అయ్యారా? అన్న భావన కలిగేలా.. తాజాగా బయటకు వచ్చిన టీజర్ ఉంది. చిక్కడు దొరకడు అన్నట్లుగా వ్యవహరించే తలసాని.. ఘాటు వ్యాఖ్యలు చేసినా.. ఎక్కడా వేలెత్తి చూపించే అవకాశాన్ని ఇవ్వరు. అలాంటిది సదరు ఇంటర్వ్యూలో మాత్రం ఆయన దొరికిపోయారా? అన్న సందేహం కలుగక మానదు.
ఇటీవల కాంగ్రెస్ అధినేత్రి సోనియాపై అసోం ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావిస్తూ.. తాను ఆ మాటల్నివిన్నప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నట్లుగా చెప్పటం తెలిసిందే. ఇదే విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తూ తలసాని చేసిన వ్యాఖ్యలు ఆయన్ను ఇరుకున పెట్టేలా చేయటమే కాదు.. ఆయన తొలిసారి దొరికిపోయినట్లుగా ఆయన మాటలు ఉండటం గమనార్హం.
కాంగ్రెస్ ను కేసీఆర్ ప్రేమిస్తున్నారంటూ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల్ని ప్రస్తావించిన సందర్భంగా తలసాని స్పందిస్తూ.. ‘‘అసోం సీఎం దారుణమైన మాటను మాట్లాడితే.. దాన్ని ఖండిస్తే దానికి కాంగ్రెస్ తో కలిసి పోతారని మాట్లాడితే అంతకంటే దుర్మార్గం ఏముంటుంది?’’ అన్న వ్యాఖ్యలకు స్పందిస్తూ.. ‘మీ అందరికి రాజకీయ జీవితాన్ని ఇచ్చిన ఎన్టీఆర్ బిడ్డ భువనేశ్వరి గురించి ఏపీ అసెంబ్లీలో .. ఆగాగు.. నేను చెప్పేది పూర్తి కానివ్వు’ అంటూ ఇంటర్వ్యూ చేసిన ఆంధ్రజ్యోతి ఆర్కే సీరియస్ కామెంట్ కు తలసాని స్పందించటం.. ఆయన్ను ఇరుకున పెట్టే అవకాశం ఉందంటున్నారు.
తాజాగా విడుదలైన టీజర్ లో.. ‘‘మీకు అది ఇంపార్టెంట్ ఏమో మాకు కాదు’’ అంటూ తలసాని వ్యాఖ్యలకు ఆర్కే సీరియస్ అవుతూ.. ‘‘మీకు కాదు.. మాకూ కాదు.. ఒక్క క్షణం ఆగండి.. మీరు అన్ని బుల్ డోజ్ చేయటమే..’’ అంటూ హీటెడ్ వాతావరణం చోటు చేసుకుంది. దీని తర్వాత ఏం జరిగిందన్నది ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయ్యాక తేలనుంది. ఇదే ఇంటర్వూలో మరిన్ని ఆసక్తికర అంశాల ప్రస్తావన ఉంది.
అమరావతితో హైదరాబాద్ కు ఇబ్బందని.. జగన్ వస్తే హైదరాబాద్ కు ఇబ్బంది ఉండదంటూ కేసీఆర్ తన ఎంపీలతో చెప్పిన వైనాన్ని ప్రస్తావించటం.. దానికి తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవే కాకుండా ఇంటర్వ్యూలో ప్రస్తావనకు వచ్చిన అంశాల్లో.. మోడీకి కేసీఆర్ కు వైరం.. చినజీయర్ తో పంచాయితీ.. నార్త్ ఇండియా.. సౌత్ ఇండియా నినాదాన్ని కేసీఆర్ ఎంతమేర ప్రయోగించనున్నారు?
గంటల కొద్ది క్యాబినెట్ భేటీలో మంత్రులకు నిద్ర రాదా? కేసీఆర్ ఫ్రంట్ లో జగన్ ను కలుపుకోరా? కేసీఆర్ తో ఏడేళ్ల నుంచి అంత క్లోజ్ గా ఎలా ఉంటున్నారు? అదెలా సాధ్యమైంది? ఆ రహస్యమేంది? లాంటి ప్రశ్నలకు సంధించటం.. వాటికి సమాధానాలు ఏం చెప్పారన్నది త్వరలో టెలికాస్టు అయ్యే ఇంటర్వ్యూతో వివరాలు బయటకు రానున్నాయి.