Begin typing your search above and press return to search.

చంద్రబాబు ఆ మాట ఎందుకు చెప్పడం లేదు?

By:  Tupaki Desk   |   10 Jun 2015 4:21 AM GMT
చంద్రబాబు ఆ మాట ఎందుకు చెప్పడం లేదు?
X

ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ మంత్రులు జోరు పెంచుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటేనే అంతెత్తున ఎగిరిపడే టీడీపీ మాజీ నేత, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోమారు బాబుపై దుమ్మెత్తిపోశారు. టీఆర్ఎస్ ను, ప్రభుత్వాన్ని అబాసు పాలు చేసేందుకే... ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు పాల్పడ్డారని ఆరోపించారు. స్టీఫెన్ సన్ తో బేరం కుదుర్చాలని రేవంత్ ను పంపలేదని చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదని తలసాని ప్రశ్నించారు. విడుదలయిన టేపుల్లో ఉన్నట్లు తాను స్టీఫెన్ తో మాట్లాడినది నిజం కాదని ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. అవన్నీ చేసింది చంద్రబాబు కాబట్టే...నేరుగా స్పందించడం లేదని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఆరోపించడం సరికాదన్నారు. అలాంటి ఆధారాలుంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని తేలితే టీడీపీ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా? అని తలసాని సవాల్ విసిరారు. ఏపీ నేతల ఇంటి వద్ద సెక్యూరిటీని మార్చుకుంటున్న కరెంట్, నీళ్లను ఎక్కడి నుంచి తెచ్చుకుంటారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేసిన తప్పుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలను పణంగా పెట్టాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. .

రాజకీయాలను దిగజార్చిన నీచుడు చంద్రబాబు అంటూ తలసాని ధ్వజమెత్తారు. అలాగే పరిటాల రవి హత్యను కూడా చంద్రబాబు తన రాజకీయాలకు వాడుకున్నారని విమర్శించారు. పరిటాల హత్య కేసులో దోషి అయిన జేసీ దివాకర్ రెడ్డిని తమ పార్టీలో చేర్చుకుని ఎంపీ టికెట్ ఇచ్చారని చెప్పారు. ఆ చర్య రవి ఆత్మ క్షోభకు కారణం కాదా అని ప్రశ్నించారు. రాజకీయాలు, అవసరాల కోసం బాబు ఏమైనా చేస్తాడనేది ఎన్నో సార్లు రుజువైందని చెప్పారు. వైఎస్ ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ పై చంద్రబాబు అక్రమ కేసులు పెట్టించారని అన్నారు.

తను టీడీపీలో ఉండగా.....పార్టీ లేదా చంద్రబాబు నుంచి ఒక్కరూపాయి కూడా తీసుకోలేదని తలసాని చెప్పారు. చంద్రబాబు తనకు గతంలో డబ్బులు ఇవ్వలేదని తన పిల్లల మీద ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తనకు డబ్బులు ఇచ్చినట్లు చేస్తున్న ప్రచారమే నిజం అయితే లోకేష్ పై చంద్రబాబు ప్రమాణం చేస్తారా? అంటూ తలసాని సవాల్ విసిరారు.