Begin typing your search above and press return to search.
తలసాని రివర్స్ సవాల్.. చంద్రబాబు ఢమాల్
By: Tupaki Desk | 3 April 2017 10:54 AM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రివర్స్ సవాల్ విసిరారు. వైసీపీ నుంచి పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తే... తెలంగాణలో తాను కూడా రాజీనామా చేస్తానని అన్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడంపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిజాయతీ, నిప్పులాంటి పదాలను చంద్రబాబు ఇక వాడకపోవడమే మంచిదని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
గతంలో గవర్నర్ నిర్ణయాన్ని చంద్రబాబు తప్పుబట్టారని... పార్టీలు మారిన వారికి మంత్రి పదవులు ఇవ్వొద్దంటూ కాళ్లు అరిగేలా ఢిల్లీలో తిరిగారని... ఇప్పుడు అదే పనిని ఆయన కూడా చేశారని విమర్శించారు. అప్పట్లో తలసాని టీడీపీ టిక్కెట్ పై గెలిచి టీఆరెస్ లో చేరగా అక్కడ మంత్రి పదవి రావడం.. దానిపై చంద్రబాబు గగ్గోలు పెడుతూ తలసాని రాజీనామా చేసి మళ్లీ గెలిచి మంత్రి పదవి అందుకోవాలని సవాల్ విసరడం తెలిసిందే. చంద్రబాబు మంత్రివర్గ విస్తరణలో వైసీపీ నుంచి ఫిరాయించిన నలుగురికి బెర్తులిచ్చిన నేపథ్యంలో ఇప్పుడు తలసాని ఇదే విషయమై చంద్రబాబుకు సవాల్ విసిరారు.
తాను టీఆర్‌ఎస్‌లో చేరి, మంత్రినయితే.. దాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోయారనీ, విలువల గురించి మాట్లాడారనీ, రాజకీయ వ్యభిచారమంటూ విమర్శలు చేశారనీ, ఇప్పుడు ఆయనేం చేస్తున్నారని తలసాని ప్రశ్నించారు. చంద్రబాబుని తెలంగాణ ప్రజలెప్పుడో తిరస్కరించారనీ, 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలూ ఆయనకు బుద్ధి చెబుతారంటూ తలసాని మండిపడ్డారు. రాజకీయాల్లో ఎవరైనా నీతులు చెప్పేయొచ్చు. చంద్రబాబే చెప్పగా లేనిది, తలసాని చెబితే ఏంటట.? నేను రాజకీయ వ్యభిచారం చేశానని గొంతు చించుకున్న చంద్రబాబు ఇప్పుడు చేస్తున్న పనిని ఏమంటారో చెప్పాలని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
మంత్రి పదవులిచ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ గెలిపిస్తే తాను కూడా తన మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని.. చంద్రబాబు ఆ పని చేయగలరా అని తలసాని సవాల్ విసిరారు. మరి దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి. నిజాయితీపరుడినని నిరూపించుకుంటారో లేదంటే సిగ్గులేనివాడిగా చలామణీ అవుతారో వెయిట్ అండ్ సీ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/