Begin typing your search above and press return to search.
ఆంధ్రోళ్లను ఆడుకుంటున్నారన్న తలసాని
By: Tupaki Desk | 25 July 2018 5:03 AM GMTరాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలు గతంతో పోలిస్తే మెరుగుపడ్డాయని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఏపీపై వ్యాఖ్యలు చేయటం మినహాయిస్తే.. తెలంగాణ అధికార పక్షానికి చెందిన పలువురు నేతలు.. ప్రజలు ఆంధ్రోళ్ల తరఫున గళం విప్పుతున్న వైనం తెలిసిందే.
విభజన మీద మాట్లాడకున్నా.. విభజన తర్వాత ఆంధ్రా పరిస్థితి ఏ మాత్రం బాగోలేదన్న విషయాన్ని ఒప్పుకుంటున్నారు. ఏపీకి ఏదో చేస్తామన్న హామీలపై మాట మార్చటాన్ని వారు తప్పు పడుతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఏపీ ప్రజల దుస్థితిపై అయ్యో.. పాపం అన్నట్లుగా వ్యాఖ్యలు చేయటం గమనార్హం.
ఏపీలోని రాజకీయ నేతలు తమ స్వార్థం కోసం ఏపీ ప్రజల్ని బంతాట ఆడుకుంటున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ఏపీకి ప్రత్యేక హోదా సాధనలో భాగంగా మోడీ తీరుపైనా.. కేంద్రం వ్యవహరిస్తున్న వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తూ ఏపీ విపక్ష నేత జగన్ మంగళవారం రాష్ట్ర బంద్‌కు పిలుపు ఇవ్వటం తెలిసిందే. ఈ బంద్ విషయంలో ఏపీ అధికారపక్షంతో పాటు.. కొన్ని విపక్షాలు కలిసి రాకపోవటాన్ని తలసాని ప్రశ్నించారు.
జగన్ బంద్‌కు ఏపీలోని రాజకీయ పార్టీలు ఎందుకు మద్దతు ఇవ్వలేదని ప్రశ్నించిన ఆయన.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారో లేదా? అన్న విషయాన్ని స్పష్టం చేయాలని గతంలో తమ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించిన వైనాన్ని గుర్తు చేశారు.
ఇక.. తెలంగాణ రాజకీయాల మీద మాట్లాడిన తలసాని.. తెలంగాణ కాంగ్రెస్ కు కీలకమైన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. జానారెడ్డిలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వారిద్దరూ దద్దమ్మలు అన్న ఆయన.. తెలంగాణ ప్రయోజనాల గురించి కాంగ్రెస్ ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు.