Begin typing your search above and press return to search.
ఏపీ తమ్ముళ్లకు తలసాని మాట షాక్
By: Tupaki Desk | 30 March 2016 5:08 AM GMTతెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన మాటలతో షాకులివ్వటం మామూలే. ప్రెస్ మీట్ పెట్టేసి రాజకీయ ప్రత్యర్థులపై ఓ రేంజ్ లో విరుచుకుపడటం.. ఆయన నోటి ధాటికి ఆయన రాజకీయ ప్రత్యర్థులు విలవిలలాడటం మామూలే. అయితే.. ఈ ఫైర్ బ్రాండ్ నేత.. తన ఎదుట పడిన తెలుగుదేశం నేతలకు తన మాటతో నోట మాట రాకుండా చేశారని చెప్పొచ్చు. అసెంబ్లీ లాబీల్లో చోటు చేసుకున్న ఈ ఆసక్తికర సంఘటన పలువురి దృష్టిని ఆకర్షించింది.
ఏపీ టీడీపీ సీనియర్ నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. కళా వెంట్రావులు మంగళవారం అసెంబ్లీ లాబీల్లో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎదుట పడ్డారు. ఒకప్పుడు తెలుగు తమ్ముడైన తలసానిని.. ఈ ఏపీ అధికారపక్ష నేతలు పలుకరించారు. ఈ సందర్భంగా మాటలుకలిపిన తలసాని.. వారు ఊహించని పంచ్ ఒకటి ఇచ్చారు.
తాను తెలంగాణలో మంత్రిని అయ్యానని.. ఏపీలో అధికారం ఉండి కూడా మీకు మంత్రి పదవులు రాలేదే అంటూ తలసాని తనదైన స్టైల్లో వ్యాఖ్యలు చేయటం.. దానికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక.. గంటు ముఖం పెట్టలేక.. బలవంతపు నవ్వును ఒకటి ముఖాన తెచ్చుకొని అక్కడి నుంచి బయటపడిన తీరు చూసినప్పుడు.. తలసాని మైండ్ గేమ్ కు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. తలసాని టాలెంట్ చూస్తుంటే.. ఎప్పుడు.. ఎక్కడ పుల్ల పెట్టాలో బాగా తెలిసినట్లుందన్న భావన కలగటం ఖాయం.