Begin typing your search above and press return to search.
బాబుకు తలసాని ఫిటింగ్..కోర్టుకైనా వెళతా
By: Tupaki Desk | 28 Feb 2019 4:28 PM GMTఏపీ రాజకీయాలపై - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై టీఆర్ ఎస్ నేత - తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోమారు నిప్పులు చెరిగారు. సచివాలయంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ...తెలంగాణలో చంద్రబాబు నాయుడు సమావేశాలు పెట్టుకున్నప్పుడు - రోడ్ షోలు నిర్వహించినప్పుడు తమ ప్రభుత్వం ఆటంకం కలిగించలేదని అయితే - ఏపీలో యాదవ బీసీ గర్జన సభ పెడుతామంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. తాముసభ పెట్టుకుంటామంటే బాబుకు భయమెందుకు అని ప్రశ్నించారు. మార్చి 3వ తేదీన నిర్వహించనున్న యాదవ గర్జనకు ఏపీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. నాలుగు రోజులుగా తిరుగుతున్నా ఇప్పటి వరకు సభకు పోలీసులు అనుమతివ్వలేదన్నారు. ఎస్పీ స్థాయి నుంచి సీఐ స్థాయి అధికారి వరకు అవనసర ప్రశ్నలు వేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఎస్పీతో ఫోన్ లో మాట్లాడితే.. సీఎం నుంచి అనుమతి రాలేదని చెపుతున్నాడనీ.. బీసీల సబ అంటే చంద్రబాబుకు ఎందుకు భయమనీ.. ఎందుకు అనుమతి ఇవ్వడంలేదనీ మండిపడ్డారు. వెంటనే పోలీసులు సభకు అనుమతివ్వకపోతే.. కోర్టుకు వెళతామని మంత్రి తలసాని స్పష్టం చేసారు.
ఏపీలో యాదవ బీసీ గర్జన సభ పెడుతామంటే అక్కడి పోలీసులు అడ్డుకుంటున్నారని తలసాని వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో సమావేశాలు పెట్టుకొని మాట్లాడుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉందన్నారు. ``గతంలో నేను విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు అక్కడి పోలీసులు వేధించారు. మనం ఇండియాలో ఉన్నామా? పాకిస్థాన్ లో ఉన్నామా? అని పోలీసులను అప్పుడే ప్రశ్నించాను. అయినప్పటికీ నేటికి కూడా ప్రభుత్వ ఆదేశావల మేరకు పోలీసులు తమ విధానాలను మార్చుకోవడం లేదు. ఏపీ ప్రభుత్వం - పోలీసులు వెంటనే స్పందించి బీసీ గర్జన సభకు అనుమతివ్వాలి ఏపీ పోలీసులు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తే.. ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి నిరసన వ్యక్తం చేయిస్తా``అని తేల్చిచెప్పారు.
ఏపీలో తన అనుచరులు - మద్దతుదారులపై పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యల వల్ల ఏపీ ప్రభుత్వానికే నష్టమని చెప్పారు. తాము సభ నిర్వహిస్తామంటే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబు ఇంటికి పోయే సమయం ఆసన్నమైందన్నారు. బడుగు - బలహీన వర్గాలకు - వెనుకబడిన తరగతుల వారికి ఏపీలో తీవ్ర నష్టం జరుగుతుందని అని తలసాని పేర్కొన్నారు. పోలీసులు సభకు అనుమతివ్వకపోతే.. కోర్టుకు వెళతామని మంత్రి తలసాని స్పష్టం చేసారు.