Begin typing your search above and press return to search.

టీడీపీ రెండునెల‌ల్లో ఓడిపోయే పార్టీ

By:  Tupaki Desk   |   3 March 2019 2:02 PM GMT
టీడీపీ రెండునెల‌ల్లో ఓడిపోయే పార్టీ
X
ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడుపై తెలంగాణ మంత్రి - టీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ మ‌రోమారు మండిప‌డ్డారు. రెండు నెలల్లో ఓడిపోయే పార్టీ టీడీపీ పార్టీ - ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో పుట్టగతులు లేకుండా పోవడం ఖాయమని ఆయన ఎద్దేవా చేశారు. సంక్షేమం గాలికి వ‌దిలి రాజ‌కీయాలంటూ ప‌ర్య‌టిస్తున్నార‌ని త‌ల‌సాని మండిప‌డ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి ఆ రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి పసుపు కుంకుమ పథకం తీసుకువచ్చారని ఆరోపించారు.

మంత్రి గా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారి సిద్ధిపేట జిల్లా చేర్యాలలోని కొమురవెల్లి మల్లన్నను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి - పట్నం సమర్పించారు. అనంత‌రం మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్‌ యాదవ్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అన్ని ఆలయాలకు మహర్ధశ కలిగిందని మంత్రి అన్నారు. మరో తిరుపతిని తలపించే విధంగా యాదాద్రి ఆలయాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి ఆ రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి పసుపు కుంకుమ పథకం తీసుకువచ్చారని ఆరోపించారు.

ఓటుకు నోటు కేసులో పారిపోయిన పిరికిపంద ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అని త‌ల‌సాని మండిప‌డ్డారు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీ కాళ్ళ దగ్గర పెట్టిన ఘనత చంద్రబాబుది మండిపడ్డారు. మతిభ్రమించిన చంద్రబాబు విషపూరితమైన మాటలు మాట్లాడటం మానుకోవాలని మంత్రి తలసాని హితువు పలికారు. తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రా వారిని నీ కడుపులో పెట్టి చూసుకుంటున్న సీఎం కేసీఆర్ పై ఆరోపణలు చేయడం తగదని హెచ్చరించారు.