Begin typing your search above and press return to search.
టీడీపీ మాజీ మంత్రి లోకేష్ ఎవరనడిగారు!!
By: Tupaki Desk | 25 Jan 2016 4:05 AM GMTగ్రేటర్ ఎన్నికల ప్రచారం విషయంలో తెలంగాణ అధికారపక్ష నేతలు ఆచితూచి వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ చాలా జాగ్రత్తగా వ్యాఖ్యలు చేస్తూ.. ఎక్కడా తన మాటల్లో అనవసరమైన వ్యాఖ్యను చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీమాంధ్రుల మనసుల్ని నొప్పించే చిన్న అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించటం లేదు సరికదా.. విపరీతమైన ప్రేమను ప్రదర్శిస్తున్నారు. తన వ్యాఖ్యలతో హైదరాబాద్ లో ఉంటున్న సెటిలర్ల మనసుల్ని దోచుకునే ప్రయత్నంలో కేటీఆర్ బిజీగా ఉంటే.. అందుకు భిన్నంగా తెలంగాణ మంత్రి ఒకరు వ్యవహరించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నా.. ఆయన కుమారుడు లోకేశ్ అన్నా అంతెత్తు ఎగిరిపడే తెలంగాణ మంత్రి.. టీడీపీ తరఫున పోటీ చేసి.. మధ్యలో జంప్ అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ తాజాగా లోకేశ్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి కుమారుడు లోకేశ్ ప్రచారం చేస్తున్న వైనాన్ని ప్రస్తావిస్తూ.. ఆ అంశంపై స్పందించాల్సిందిగా తలసానిని మీడియా ప్రతినిధులు కోరితే.. ఊహించని విధంగా చెలరేగిపోయారు.
చంద్రబాబు గురించి అడగండి మాట్లాడతా.. అంతేకానీ లోకేశ్ గురించి ఏమిటి? అయినా లోకేశ్ ఎవరు.. ఓ బచ్చా అంటూ వ్యాఖ్యలు చేయటం చర్చనీయాంశంగా మారింది. బచ్చా బాబు గురించి మాట్లాడే అవసరం తనకు లేదన్న తలసాని వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకూ తెలుగుదేశం పార్టీలో ఉండి.. లోకేశ్ నిర్వహించిన సభలకు హాజరై.. చినబాబు పట్ల అత్యంత విధేయతను ప్రదర్శించిన తలసాని ఇప్పుడు అందుకు భిన్నంగా చెలరేగిపోవటం ఒక ఎత్తు అయితే.. తెలుగుదేశం పార్టీ గురించి.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విషయంలో ఘాటైన వ్యాఖ్యలు చేయకుండా తెలంగాణ అధికారపక్ష నేతలు జాగ్రత్త పడుతుంటే.. అందుకు భిన్నంగా మంత్రి తలసాని విరుచుకుపడటంపై విస్మయం వ్యక్తమవుతోంది.