Begin typing your search above and press return to search.
దళిత సీఎం మాట ఏమైంది తలసానీ?
By: Tupaki Desk | 16 Oct 2018 2:39 PM GMTటీఆర్ఎస్ నేతల తీరు విచిత్రంగా ఉంటుంది. తాము ఏదైనా మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకుంటే దాని గురించి ప్రస్తావిస్తేనే కస్సుమని విరుచుకుపడుతుంటారు. అదే సమయంలో తాము మాత్రం విపక్షాలను ఉద్దేశించి ఎంత మాట అయినా వెనకాముందు లేకుండా మాట్లాడేయటం కనిపిస్తుంది. తాజా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ లో సీఎం అభ్యర్థి ఎవరో వాళ్లకే తెలియదని ఎద్దేవా చేశారు. రాహుల్ సభలో సీఎం అభ్యర్థిని ప్రకటించే దమ్ముందా? అంటూ ప్రశ్నించారు. నిజమే.. కాంగ్రెస్ సమాధానం చెప్పలేని ప్రశ్నల్ని సంధించటం టీఆర్ఎస్ నేతలకు అలవాటే. ఒక్కో పార్టీకి ఒక్కో అలవాటు ఉంటుంది.
ఎక్కడి దాకానో ఎందుకు..బీజేపీ సంగతే చూస్తే.. ఆ పార్టీ ఎన్నికల సమయంలో తమ సీఎం అభ్యర్థి ఎవరన్న విషయాన్ని అస్సలు ప్రస్తావించదు. ఎన్నికల ఫలితానికి తగ్గట్లు నిర్ణయం తీసుకోవటం కనిపిస్తుంది. అదే తీరులో కాంగ్రెస్ విధానం కూడా ఉందన్నది మర్చిపోకూడదు.
నిజానికి ఇలాంటి విషయాలన్నీ తలసానికి తెలియనివి కావు. కానీ.. వారు మాట్లాడేందుకు ఎందుకంటే.. ప్రజల దృష్టిని ఆకర్షించటానికి ఈజీ మార్గాలివే మరి. ఇన్ని మాటలు మాట్లాడే తలసాని. తమ అధినేత తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితుడే ఉంటాడన్న మాటను ఎందుకు నిలబెట్టుకోలేదో? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నం మాత్రం చేశారు. సరే.. మొదటిసారి తెలంగాణకు కేసీఆర్ సీఎంను చేశారు.. మరి.. ఈసారి ఎన్నికల్లో విజయం సాధిస్తే.. కేసీఆర్ తన పాత మాటను నిలబెట్టుకుంటారా? దళిత నేతను సీఎం చేస్తానని కేసీఆర్ చేత తలసాని అండ్ కో చెప్పగలరా? ఆ దమ్ము వారికుందా? అన్న ప్రశ్నల్ని కాంగ్రెస్ నేతలు సంధిస్తున్నారు. ఏమంటావ్ తలసాని?