Begin typing your search above and press return to search.
తమ్ముళ్లకు పంచ్ వేసిన తలసాని
By: Tupaki Desk | 18 Jan 2017 9:28 AM GMTఅనుకున్నదే జరిగింది. కాకుంటే వ్యక్తులు మారారు. కదిలించి తిట్టించుకునే అవకాశం ఉందన్న సందేహాలకు తగ్గట్లే.. తెలంగాణరాష్ట్ర మంత్రి తలసాని.. తెలంగాణ తెలుగుదేశం నేతలపై విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ వర్థంతిని పురస్కరించుకొని తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి.. మరో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ జయంతిని.. వర్థంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
దీనిపై తాజాగా స్పందించిన తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తిరుగులేని పంచ్ వేశారు. రేవంత్.. సండ్రలు ఈ డిమాండ్ చేసే ముందు.. మొదట ఏపీలో చంద్రబాబు సర్కారు ఈ తరహా జీవోను విడుదల చేయాలని చెప్పాలన్నారు. ఎన్టీఆర్ జయంతిని.. వర్థంతిని అధికారికంగా నిర్వహించేలా ఏపీ సర్కారు జీవో తీసుకొస్తే.. తెలంగాణ సర్కారు ఆలోచిస్తుందని వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎన్టీఆర్ జయంతిని.. వర్థంతిని అధికారికంగా నిర్వహించాలన్నడిమాండ్ ను చేసేటప్పుడు.. ఆ విషయంపై తమ పార్టీ అధికారంలో ఉన్న ఏపీలో ఏం చేస్తున్నారు? అన్న విషయంపై కనీస అవగాహన లేకుండా రేవంత్.. సండ్రలు మాట్లాడటంపై పలువురు తప్పు పడుతున్నారు. ఇలాంటి డిమాండ్లతో ఎన్టీఆర్ ను అనవసరంగా తక్కువ చేసినట్లు అవుతుందన్న వాదన వినిపిస్తోంది.
ఎన్టీఆర్ పేరును.. బొమ్మను పెట్టుకొని రాజకీయం చేసే పార్టీ పవర్ లో ఉన్న చోట అధికారికంగా వర్థంతి.. జయంతులు నిర్వహించకుండా.. వేరే రాష్ట్రంలో నిర్వహించాలని డిమాండ్ చేయటం ఏ మాత్రమైనా అర్థం ఉందా? అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. అవగాహన లేకుండా.. ఏదో మాట్లాడాలన్నట్లుగా మాట్లాడితే ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతాయన్న విషయాన్ని రేవంత్ అండ్ కోలు గుర్తిస్తే మంచిది. ఏదో ఒకటి మాట్లాడి మీడియాలో కనిపించటం మినహా మరో పని లేనట్లుగా వ్యవహరిస్తున్న రేవంత్ లాంటి వారి తీరుపై పలువురు తెలుగుదేశం పార్టీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/