Begin typing your search above and press return to search.

తలసాని కుమ్మేశాడు.. వైరల్ వీడియో..

By:  Tupaki Desk   |   23 July 2019 10:14 AM GMT
తలసాని కుమ్మేశాడు.. వైరల్ వీడియో..
X
వర్ష కాలం ప్రారంభంలో రోగాలు రాకుండా.. ఎలాంటి కీడు సోకుకుండా పిల్లా పాప- ముసలి ముతక పాడి పంటలు- ప్రజలు సల్లాగా ఉండాలని గ్రామ దేవతలను కొలిచే పండుగ ‘బోనాలు’. గ్రామాల్లోని ఎల్లమ్మ- పోచమ్మ- మైసమ్మలను కొలుస్తూ బోనాల పండుగను నిర్వహిస్తుంటారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో బోనాలకు ప్రత్యేకత ఉంది. నిజాం కాలంలోనూ బోనాల జాతర కొనసాగేదని చరిత్ర చెబుతోంది. గోల్కొండ కోటలోనూ అమ్మవారి ప్రతిమను పెట్టారు. ముఖ్యంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ బోనాల జాతర ఎంతో ఫేమస్.

సికింద్రాబాద్ లో బోనాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడ అమ్మవారి రూపంలోని మహిళ ‘రంగం’ చదివి భవిష్యవాణిని కూడా వినిపిస్తుంది. ఇక ఇదే ప్రాంతంలో పుట్టి పెరిగిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా చిన్నప్పుడు ఎంతో వైభవంగా బోనాల పండుగను జరుపుకునేవాడట.. తలసాని రాజకీయాల్లోకి రాకముందు అంతా ఆయనను ‘ఆలుగడ్డ శీను’ అని పిలిచేవారట..

తాజాగా ఉజ్జయినీ మహంకాళీ బోనాల జాతరను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదయ్య నగర్ లో పలహారపు బండిని ఊరేగించారు.ఈ ఊరేగింపులో మంత్రి తలసాని డ్యాన్స్ చేసి అందరినీ అలరించారు.

అంత వయసులోనూ డప్పుచప్పుళ్ల మధ్య స్టెప్పులేసిన మంత్రిని ఆయన సమకాలికులు ‘ఆలుగడ్డ శీను’ డ్యాన్సు చూడరా అంటూ కేరింతలు కొడుతూ ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మంత్రి స్టెప్పులు సెంటర్ ఆఫర్ అట్రాక్షన్ గా మారింది.