Begin typing your search above and press return to search.
విజయవాడ వెళ్లి మరీ బాబును తిట్టొచ్చాడు..
By: Tupaki Desk | 14 Feb 2019 11:02 AM GMTటీఆర్ ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని ఏపీ రాజధాని అమరావతి వెళ్లి మరీ ఏపీ సీఎం చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టొచ్చాడు. ఏపీలో బీసీలకు తగిన ప్రాధాన్యత లేదని.. ఓట్ల కోసం మాత్రమే చంద్రబాబు వాడుకుంటున్నాడని ధ్వజమెత్తారు. అవినీతిలో ఏపీ ముందంజలో ఉందని.. ఏపని కావాలన్నా ఇక్కడ డబ్బు కట్టాల్సిందేనని విమర్శించాడు.
వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజలు మంచి నిర్ణయం తీసుకుంటారని తలసాని జోస్యం చెప్పారు. నాకు ఏపీకి వచ్చే హక్కు లేదా.. తాను ప్రెస్ మీట్ పెట్టకూడాదా అని.. విజయవాడ వస్తే ఏపీ పోలీసులను పంపి విచారణ చేయిస్తారా అని తలసాని ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.
లోటు బడ్జెట్ అంటూ కోట్లు పెట్టి పత్రికలు, చానెళ్లకు చంద్రబాబు ప్రకటనలు ఇస్తున్నారని.. ధర్మ పోరాట దీక్షలకు దిగుతూ ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నాడని తలసాని విమర్శలు గుప్పించారు. ఏపీకి తమ అండ ఉంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించారని.. కానీ చంద్రబాబు రాజకీయం చేస్తూ తమకు మోడీ, జగన్, పవన్ లతో ముడిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు పార్టీలతో సంబంధం లేదని.. తమ బిసీ కులాలను చైతన్యం చేస్తానని తలసాని ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ లో పాడి రైతులు నష్టాలను ఎదుర్కొంటున్నారని.. కానీ ముఖ్యమంత్రి తన సొంత పాలకంపెనీ హెరిటేజ్ మాత్రం లాభాల బాటలో ఎలా సాగుతుందని తలసాని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాపులకు ఇచ్చి కోటాను సీఎం చంద్రబాబు అమలు చేయలేదని తలసాని మండిపడ్డారు.
కాగా తలసాని విమర్శలు ఏపీ నేతలు ఘాటుగా స్పందించారు. తెలంగాణలో మంత్రి వర్గం లేదని.. మంత్రులు లేరని.. అక్కడ పరిపాలనపై దృష్టిపెట్టకుండా ఏపీలో బాబును విమర్శిస్తావా అని తలసానికి తలంటారు.