Begin typing your search above and press return to search.
తలసాని మాట: బాబు ఓ సత్యహరిశ్చంద్రుడు
By: Tupaki Desk | 23 Feb 2016 9:25 AM GMTతెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంటే ఒంటికాలిపై లేచే పార్టీ నేత(?) ఎవరైనా ఉన్నారంటే...తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు టక్కున వినిపిస్తోంది. టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్ ఎస్ సర్కారులో మంత్రిగా చేరిన తలసానిపై తెలుగుతమ్ముళ్లు నిప్పులు చెరిగారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిన సందర్భంగా అందివచ్చిన అవకాశం ఇదేనని చంద్రబాబుపై తలసాని విరుచుకుపడ్డారు.
తాము టీఆర్ ఎస్ లో చేరినపుడు చంద్రబాబు వాడిన భాష తనకు బాధకలిగించిందని తలసాని ఆవేదన వ్యక్తం చేశారు. "ఇపుడు చంద్రబాబు నాయుడు పార్టీలో టీడీపీలో చేరిన వారితో రాజీనామా చేయించి మళ్లీ ఎన్నికలు పెడతారా? మమ్మల్ని రాజీనామా చేయించినట్లే వారితోనూ చేయిస్తారా? నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడకూడదు. సత్య హరిశ్చంద్ర చంద్రబాబు నిన్ను ఆదర్శంగా తీసుకుని ఎలా మసలు కోవాలో నువ్వే చెప్పు?" అంటూ దుయ్యబట్టారు.
నేతలు పార్టీలు మారడంపై నీతులు చెప్పే చంద్రబాబు ఏపీలో తాను కండువాలు కప్పడంపై సమాధానం చెప్పాలని తలసాని డిమాండ్ చేశారు. టీడీపీలో ఉండగా తాము చర్యలు తీసుకోవాలని కోరిన జేసీ దివాకర్ రెడ్డిని ఇపుడు ఎంపీగా కొనసాగిస్తున్న ఘనత చంద్రబాబుదని ఎద్దేవా చేశారు. నీచ రాజకీయాలకు పాల్పడుతున్న బాబు ఎంత డబ్బు ప్రలోభపెట్టి వైసీపీ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారో తెలపాలని కోరారు. ఆయన చేస్తే నీతి మరొకరు చేస్తే అవినీతా? అంటూ నిలదీశారు. తన గురించి ప్రేలాపనలు చేసిన చంద్రబాబు ఇపుడు ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై సమాధానం చెప్పాలని నిలదీశారు. ఏపీ ప్రజల సంక్షేమం కోసమంటూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వేటినీ చంద్రబాబు అమలు చేయలేదని మండిపడ్డారు. ఇదిగో కొత్త రాజధాని, అదిగో అమరావతి వస్తోంది అంటూ ఏపీ ప్రజలకు చంద్రబాబు చుక్కలు చూపిస్తున్నారని ధ్వజమెత్తారు.