Begin typing your search above and press return to search.

ఏపీకి ఐదుగురు టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు..

By:  Tupaki Desk   |   30 Dec 2018 5:42 AM GMT
ఏపీకి ఐదుగురు టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు..
X
కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ మామూలుగా ఉండదని అర్థమవుతోంది. అదీ చాలా ఎఫెక్టివ్ గానే ఉంటుందని నిన్నటి కేసీఆర్ మాటలను బట్టి అర్థమవుతోంది. తాజాగా కేసీఆర్ ఏపీకి వెళ్లడానికి ముందే టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు ఏపీలో అడుగుపెడుతున్నారు.

టీఆర్ ఎస్ తరుఫున తాజాగా జరిగిన ఎన్నికల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా ఐదుగురు యాదవ ఎమ్మెల్యేలు తెలంగాణ అంతటా గెలిచారు. ఆంధ్రప్రదేశ్ యాదవ సామాజికవర్గ సంఘం తాజాగా వీరిని ఆహ్వానించింది. వైసీపీ నేత జంగాకృష్ణమూర్తి కుమారుడు కోటయ్య ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామానికి ఈ ఐదుగురు టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. వీరికి ఏపీ యాదవ సంఘం పక్షాన ఈరోజు సన్మానించనున్నారు.

ఏపీలోకి వెళ్లి బాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ పేర్కొనడం.. నిన్న విలేకరుల సమావేశంలో తలసాని శ్రీనివాస యాదవ్ కూడా ఏపీకి వెళ్లబోతున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈరోజు యాదవ సన్మాన సభ పేరుతో ఐదుగురు టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు వెళుతున్నారు. వీరు ఏం మాట్లాడుతారు.? బాబు విషయంలో ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. వీరికి వచ్చిన స్పందనను బట్టి ఏపీలో గులాబీ శ్రేణుల పర్యటనలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ సభపైనే అందరి దృష్టి నెలకొంది. ఈ కులసభ రాజకీయ హీట్ ను పెంచుతోంది.