Begin typing your search above and press return to search.

మాట్లాడ‌టం కూడా రాని నీకెందుకు బాల‌య్యా ప్ర‌చారం?

By:  Tupaki Desk   |   29 Dec 2018 8:03 AM GMT
మాట్లాడ‌టం కూడా రాని నీకెందుకు బాల‌య్యా ప్ర‌చారం?
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిశాయి. ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. బంప‌ర్ మెజారిటీతో టీఆర్ ఎస్ మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చింది. పార్టీల హ‌డావుడి త‌గ్గిపోయింది. కానీ - ప్ర‌చార ప‌ర్వంలో ఓ నాయ‌కుడు ఉప‌యోగించిన ప‌ద‌జాలం మాత్రం ఇప్ప‌టికీ జ‌నాన్ని న‌వ్విస్తూనే ఉంది. ఆయ‌న పేరు - ఆయ‌న ఉప‌యోగించిన మాట‌లను ప‌దే ప‌దే గుర్తుతెచ్చుకొని మ‌రీ న‌వ్వుకుంటున్నారు అంతా.

జ‌నం పెద‌వుల‌పై చిరున‌వ్వులు పూయిస్తున్న ఆ నాయ‌కుడు మ‌రెవ‌రో కాదు ప్ర‌ముఖ సినీ హీరో కూడా అయిన‌ నంద‌మూరి బాల‌కృష్ణ. టీడీపీ-కాంగ్రెస్ కూట‌మి త‌ర‌ఫున ప్ర‌చారానికి వ‌చ్చిన బాల‌కృష్ణ సారే జ‌హాసె అచ్చా ను ఆల‌పించ‌బోయి త‌డ‌బ‌డ్డాడు. లిరిక్స్ గుర్తుకు రాక చ‌తికిల‌ప‌డ్డాడు. బుల్ బుల్ బుల్ బుల్ అంటూ న‌వ్వుల‌పాల‌య్యాడు. బాల‌య్య బుల్ బుల్ అంటూ త‌డ‌బ‌డుతున్న వీడియో సోష‌ల్ మీడియాలో విస్తృతంగా ప్ర‌చారంలోకి వ‌చ్చింది. దీంతో ఈ ఏడాది మ‌న‌దేశంలో ఎక్కువ‌గా ట్రోల్ అయిన హీరోగా చెత్త రికార్డును కూడా త‌న ఖాతాలో వేసుకున్నాడు.

ఎన్నిక‌లు ముగిసిన‌ప్ప‌టికీ బాల‌య్య‌ను ఈ బుల్ బుల్ ట్రోలింగ్ మాత్రం వీడ‌ట్లేదు. తాజాగా తెలంగాణ మాజీ మంత్రి - స‌న‌త్ న‌గ‌ర్ ఎమ్మెల్యే త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ బాల‌కృష్ణ‌పై జోకులు పేల్చారు. స‌రిగా మాట్లాడ‌టం కూడా రాని బాల‌య్యకు ఎన్నిక‌ల‌ ప్ర‌చారం ఎందుక‌ని ఎద్దేవా చేశారు. ఆయ‌న ఇంట్లో కూర్చొని ఉండాల్సింద‌ని వ్యాఖ్యానించారు. బాల‌య్య మాట‌ల్లో అర్థం ఏమీ ఉండ‌ద‌ని పేర్కొన్నారు. విని న‌వ్వుకోవ‌డానికి మాత్ర‌మే ఆయ‌న మాట‌లు ప‌నికొస్తాయని అభిప్రాయ‌ప‌డ్డారు.

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడిపై కూడా త‌ల‌సాని విమ‌ర్శ‌లు గుప్పించారు. హైద‌రాబాద్ ను అభివృద్ధి చేశానంటూ ప‌దే ప‌దే చెప్పుకుంటున్న చంద్ర‌బాబు నాలుగున్న‌రేళ్లుగా అమ‌రావ‌తిని ఎందుకు అభివృద్ధి చేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు. జాబు రావాలంటే బాబు రావాలంటూ ఏపీలో టీడీపీ ప్ర‌చారం చేసింద‌ని గుర్తుచేశారు. మ‌రి బాబు అధికారంలోకి వ‌చ్చినా రాష్ట్రంలో ఉద్యోగాల క‌ల్ప‌న ఎందుకు జ‌ర‌గ‌లేద‌ని నిల‌దీశారు.