Begin typing your search above and press return to search.
మొదటి రిటర్న్ గిఫ్ట్ యాదవులే నా!
By: Tupaki Desk | 14 Jan 2019 4:37 PM GMTతెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిఫ్ట్ లు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్ ఈ సంక్రాంతికి ప్రారంభమైందా. కుల సంఘాలతో చంద్రబాబును దెబ్బకొట్టాలని కె. చంద్రశేఖర రావు చేస్తున్న ప్రయత్నాలకు సంక్రాంతి వేదిక కానుందా., వీటన్నిటికీ సమాధానం అవుననే వినిపిస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకోవడంతో ఆగ్రహించిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ప్రకటించారు. దానికి నాంది వాచకంగా ఈ సంక్రాంతి పండుగను ఎంచుకున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రతి ఏటా సంక్రాంతి పండుగకు ఆంధ్రప్రదేశ్ కు వెళ్లే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తో తన రిటర్న్ గిఫ్ట్ పథకానికి శ్రీకారం చుట్టారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ కు వెళ్లారు. ముందుగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ఆయన ఇక్కడ యాదవ కుల సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలోని యాదవులకు రాజకీయంగాను, ఆర్థికంగానూ బాగుందని తలసాని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో కూడా లకు మంచి రోజులు రానున్నాయని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దీనర్థం ఆంధ్రప్రదేశ్లో యాదవులు తెలుగుదేశం పార్టీకి దూరం కానున్నారని అది విశ్లేషకులు చెబుతున్నారు. కుల సంఘాలతో తెలుగుదేశం పార్టీని, నారా చంద్రబాబు నాయుడిని దెబ్బ కొట్టాలి అనుకుంటున్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ముందుగా తన సన్నిహితుడు తలసాని శ్రీనివాస యాదవ్ ను ప్రయోగించారని చెబుతున్నారు. ఇందులో భాగంగానే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఆంధ్రప్రదేశ్ కు వచ్చారని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రిటన్ గిఫ్ట్ ఇచ్చే పని తమ నాయకుడు చూసుకుంటారని, తాను మాత్రం సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చానని తలసాని శ్రీనివాస యాదవ్ ప్రకటించారు. అయితే దీని వెనుక మాత్రం ఆయన రాక వెనుక చంద్రబాబును దెబ్బ కొట్టాలన్న పథకం దాగి ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.