Begin typing your search above and press return to search.

ఏపీ వాళ్లను పెట్టుకున్నా తప్పేనా తలసాని

By:  Tupaki Desk   |   10 Jun 2015 5:16 AM GMT
ఏపీ వాళ్లను పెట్టుకున్నా తప్పేనా తలసాని
X
ఫోన్ల ట్యాపింగ్‌.. స్టింగ్‌ ఆపరేషన్లు నడుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన భద్రతా సిబ్బంది మొత్తాన్ని మార్చుకోవటం తెలిసిందే. ఇప్పటివరకూ బాబు భద్రత కోసం తెలంగాణ.. ఏపీ సిబ్బందిని వినియోగించేవారు.

ప్రస్తుత పరిస్థితుల్లో మొత్తంగా మార్పులు చేసేసి.. ఏపీ సిబ్బందిని మాత్రమే వినియోగిస్తున్నారు. ఈ అంశంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విమర్శిస్తున్నారు. హైదరబాద్‌లోని ఏపీ నేతలు వారి ఇళ్ల దగ్గర సెక్యూరిటీని మార్చుకుంటున్నారని.. నీళ్లు.. కరెంటు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారని ప్రశ్నిస్తున్నారు.

బాబు నివాసం దగ్గర తెలంగాణ పోలీసుల స్థానే.. ఏపీ పోలీసుల్ని నియమించుకోవటాన్ని ఉద్దేశించి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చేసిన పరోక్ష వ్యాఖ్యలు చంద్రబాబును ఉద్దేశించినవనే అర్థమవుతుంది. ఫోన్లు ట్యాప్‌ చేసినట్లు ఆధారాలు ఉంటే వాటిని బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. తమ గుట్టుమట్టును రక్షించుకోవటానికి తమకు తాముగా తీసుకునే నిర్ణయాధికారం కూడా ఏపీ సర్కారుకు లేనట్లుగా తలసాని వ్యాఖ్యలు ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సెక్యూరిటీ సిబ్బందిని ఎవరిని పెట్టుకోవాలన్నది ఏపీ ప్రభుత్వానికి అధికారం ఉన్నప్పటికీ.. ఆ అంశాల్లోకి తలసాని జోక్యంపై ఏపీ సర్కారు సీరియస్‌ అవుతోంది. సిబ్బందిని మార్చుకున్నారు.. మరి నీళ్లు.. కరెంటు మాటేమిటన్న తలసాని వ్యాఖ్యలపై టీడీపీ వర్గాలు స్పందిస్తూ.. తెలంగాణ సర్కారుకు చెందిన వారిని ఏపీ సర్కారు వినియోగించటంపై ఆయనకు అంత ఉలుకెందుకని ప్రశ్నిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు అనుమానాస్పదంగా.. ఉక్రోషంతో చేసినట్లుగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. తలసాని లాంటి వారు చేసే వ్యాఖ్యలు కారణంగా తెలంగాణ సిబ్బందిపై లేనిపోని అనుమానాలు కలిగేలా ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. అయినా.. ప్రతి అంశాన్ని బక్కలు వెతకటం ఏమిటి తలసాని..?