Begin typing your search above and press return to search.
బాబు కోసం వియ్యంకుడినే తిట్టాల్సి వస్తోందే..
By: Tupaki Desk | 14 April 2019 4:31 PM GMTటీటీడీ చైర్మన్ - మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ కు పెద్ద కష్టమే వచ్చింది. టీడీపీలో ఉన్న ఆయన టీఆర్ ఎస్ లోని తన వియ్యంకుడికి వార్నింగులు ఇచ్చి తిట్టాల్సిన పరిస్థితి వస్తోంది. అసలు విషయం ఏంటంటే.. కొన్నాళ్లుగా టీఆర్ ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు. నిత్యం చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. ఆ తలసానికి ఈ పుట్టా సుధాకర్ యాదవ్ స్వయానా వియ్యంకుడు. కానీ.. తలసాని అలా చంద్రబాబును నిత్యం విమర్శలు చేస్తుంటే పుట్టా ఇంతవరకు మౌనంగానే ఉన్నారు. కానీ.. పుట్టా తీరుపై కొద్దిరోజులుగా విమర్శలు వస్తుండడంతో ఆయన ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తలసాని పై విమర్శలు ప్రారంభించారు.
తాజాగా పుట్టా మాట్లాడుతూ.. తలసాని శ్రీనివాస్ యాదవ్ పై ఫైర్ అయ్యారు. బీసీల వంచనకు వైఎస్ కుటుంబం కేరాఫ్ అడ్రస్ అని - వారికి అన్యాయం చేసిన వైఎస్ కుటుంబం గురించి తలసాని ఎందుకు నోరు మెదపట్లేదని ప్రశ్నించారు. బీసీల వంచనకు వైఎస్ కుటుంబం కేరాఫ్ అడ్రస్ అని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణలో అడుగడునా బీసీలకు అన్యాయం జరుగుతున్నా మాట్లాడకుండా - కేసీఆర్ వద్ద మార్కులు కొట్టేయడం కోసం జగన్ ను తలసాని వెనకేసుకొస్తున్నారని పుట్టా విమర్శించారు.
ఓటు బ్యాంకుగా వాడుకోవడమే తప్ప కేసీఆర్ ఏనాడూ బీసీలకు అండగా నిలవలేదన్నారు. బీసీలే టీడీపీకి పునాది అని పుట్టా పేర్కొన్నారు. వైసీపీకి అధికార ప్రతినిధులు లేరని, మీరు అధికార ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారా? అంటూ నిలదీశారు. తాము అభివృద్ధిలో ముందున్నందుకే ఏపీపై మీకు అంత కుటిల ప్రేమా? అని ప్రశ్నించారు. మీకు - మీ నాయకుడు కేసీఆర్ కు అభివృద్ధిలో చంద్రబాబే కనిపిస్తున్నాడంటూ పుట్టా ధ్వజమెత్తారు. వంది మంది కేసీఆర్ లు వచ్చినా కూడా చంద్రబాబును ఎదుర్కోవడం కష్టమని మీకు కూడా తెలుసంటూ తలసానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణలో టీఆర్ ఎస్ ఈసీని అడ్డుపెట్టుకుని గెలిచిందని - ఇకనైనా తలసాని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని పుట్టా హెచ్చరించారు. ఏపీలో ఏర్పడేది టీడీపీ ప్రభుత్వమేనని పుట్టా ధీమా వ్యక్తం చేశారు.
అయితే... తలసానిపై విమర్శలు కురిపించే ముందు పుట్టా ముందుగానే ఆయనతో ఫోన్లో మాట్లాడారన్న ప్రచారం ఒకటి జరుగుతోంది. ‘బావా ఏమనుకోవద్దు.. కాస్త రెండు ముక్కలు ఎక్కువ విమర్శిస్తాను’ అని పర్మిషన్ తీసుకున్నారో ఏమో మరి. ఎంతైనా మిషన్ భగీరథ - ఇతర ప్రాజెక్టుల్లో కాంట్రాక్టులు కూడా దక్కాయి కదా పుట్టాకి.