Begin typing your search above and press return to search.

కేటీఆర్ మాట‌ను త‌ల‌సాని లైట్ తీసుకోనున్నారా?

By:  Tupaki Desk   |   14 Feb 2019 5:44 AM GMT
కేటీఆర్ మాట‌ను త‌ల‌సాని లైట్ తీసుకోనున్నారా?
X
మ‌రో మూడు రోజుల్లో రానున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఎలాంటి హ‌డావుడి కార్య‌క్ర‌మాలు వ‌ద్ద‌ని.. ఆడంబ‌రాల‌కు దిగొద్ద‌ని.. ప‌త్రిక‌ల్లో భారీ ఎత్తున ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చి త‌మ అభిమానాన్ని చాటుకోవ‌ద్దంటూ కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్ తాజాగా ప్ర‌క‌ట‌న చేయ‌టం తెలిసిందే.

త‌న తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పాల‌నుకున్న వారు సింఫుల్ గా ఒక మొక్క నాటాల‌న్న ఉదాత్త‌మైన సందేశాన్ని ఇచ్చారు. అయితే.. కేటీఆర్ మాట‌ను ఎవ‌రి దాకానో ఎందుకు.. ఈసారి కేసీఆర్ కేబినెట్ లో సీటు ప‌క్కా అన్న మాట వినిపిస్తున్న మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ పాటించ‌టం లేద‌న్న మాట వినిపిస్తోంది.

కేసీఆర్ పుట్టిన రోజును పుర‌స్క‌రించుకొని జ‌ల‌విహార్ లో ఆయ‌న పెద్ద ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫ్లెక్సీలు.. బ్యాన‌ర్ల‌తో పాటు భారీ ఎత్తున ఏర్పాట్లు చేయ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఓప‌క్క కేటీఆర్ స్వ‌యంగా హ‌డావుడి వ‌ద్దు.. అన‌వ‌స‌ర ఖ‌ర్చుల స్థానంలో ప‌ర్యావ‌ర‌ణ హితానికి వీలుగా మొక్క నాటాలంటే.. అందుకు భిన్నంగా భారీ ఎత్తున స‌భ‌ను నిర్వ‌హించాల‌ని త‌ల‌సాని డిసైడ్ కావ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇప్ప‌టివ‌ర‌కూ అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. తానేమీ హ‌డావుడి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌టం లేద‌ని.. కేసీఆర్ పుట్టిన రోజు వేడుక‌ను పండ‌గ‌లా మాత్ర‌మే చేస్తున్న‌ట్లుగా త‌ల‌సాని చెబుతున్నారు. ఇప్ప‌టికే ఆ రోజున ఏమేం ప్రోగ్రామ్స్ ఉంటాయ‌న్న విష‌యాన్ని త‌ల‌సాని ఇప్ప‌టికే అనౌన్స్ చేసిన ప‌రిస్థితి.

ఇలాంటివేళ‌..కేటీఆర్ రియాక్ష‌న్ ఎలా ఉంటుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. కేటీఆర్ ప్ర‌క‌ట‌న త‌ర్వాత కూడా త‌ల‌సాని త‌న వేడుక ఏర్పాట్ల విష‌యంలో వెన‌క్కి త‌గ్గ‌క‌పోవ‌టం చూస్తే.. కేటీఆర్ మాట‌ల్ని ఎవ‌రో కాదు.. త‌న తండ్రికి ఆప్త‌మిత్రుడు లాంటి వ్య‌క్తే పాటించని ప‌రిస్థితి. మ‌రి.. ఇలాంటి వాటికి కేటీఆర్ రియాక్ష‌న్ ఎలా ఉంటుంద‌న్న‌ది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.