Begin typing your search above and press return to search.

మార్చి 10న ఏపీలో తలసాని యాదవ గర్జన

By:  Tupaki Desk   |   7 March 2019 1:34 PM GMT
మార్చి 10న ఏపీలో తలసాని యాదవ గర్జన
X
తెలంగాణ ఎన్నికల్లో తలదూర్చినందుకు చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్‌ కచ్చితంగా ఇచ్చి తీరుతామని గతంలోనే ప్రకటించారు కేసీఆర్‌. ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య జరుగుతున్న డేటా ఫైట్‌ కూడా రిటర్న్‌ గిఫ్ట్‌లో భాగమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే.. డేటా ఫైట్‌ అంశంతో పాటు.. చంద్రబాబుని ఓడించేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కేసీఆర్ వదులుకోవడం లేదు. అందుకే.. తన అనుచరుడు తలసాని శ్రీనివాసయాదవ్‌ ని రంగంలోకి దింపారు. ఇప్పటికే తలసాని రెండుసార్లు ఏపీ వెళ్లి ప్రెస్‌ మీట్‌ పెట్టి మరీ చంద్రబాబుని తిట్టివచ్చారు. ఇప్పుడు మరోసారి ఏపీకి వెళ్లబోతున్నారు. యాదవ గర్జన పేరుతో గుంటూరులో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు తలసాని.

యాక్చువల్‌గా యాదవ గర్జన సభ మార్చి 3నే జరగాల్సి ఉంది. అయితే.. లా అండ్ ఆర్డర్‌ సాకు చూపించి సభకు పర్మిషన్ ఇవ్వలేదు. ఈ విషయంపై ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ తిట్టాడు తలసాని. ఇప్పుడు యాదవ గర్జన సభకు పర్మిషన్‌ వచ్చింది. మార్చి 10న సభను గుంటూరులో నిర్వహించుకునేందుకు అధికారులు సమ్మతి తెలిపారు. అయితే.. ఇక్కడ కూడా చిన్న లాజిక్‌ ఉంది. రేపో మాపో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది.నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత పెత్తనం మొత్తం ఈసీ కంట్రోల్‌ లోకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత వాళ్లే ఇస్తారు. ఇక యాదవ గర్జన సభను విజయవంతం చేసేందుకు తలసాని ముమ్మర ఏర్పాట్లలో మునిగిపోయారు. ఏపీ ప్రజానికాన్ని తలసాని కోరుతున్నది ఒక్కటే. మీరు ఓటు ఎవ్వరికైనా వేసుకోండి మాకేం అభ్యంతం లేదు. కానీ చంద్రబాబుని మాత్రం ఓడించండి అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లబోతున్నారు. మొదటినుంచి టీడీపీకి యాదవుల మద్దతు బాగా ఉంది. ఇప్పుడు తలసాని రంగంలోకి దిగడంతో.. ఎక్కడ తమ ఓట్లు చీలిపోతాయామోనని భయపడుతోంది టీడీపీ అధిష్టానం.