Begin typing your search above and press return to search.
తలసాని సర్వే - జగన్ కు వచ్చే సీట్లు ఎన్నంటే...
By: Tupaki Desk | 20 March 2019 5:32 PM GMTఏపీ అసెంబ్లీ ఫలితాలపై జగన్ కంటే టీఆర్ ఎస్ ఎక్కువ ఆసక్తి చూపిస్తోంది. అనుక్షణం ఏపీ పరిణామాలను గమనిస్తోంది. తాజాగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఏపీలో రాబోయే ఫలితాలపై తన అంచనాలను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ఓటమి ఖాయమని... జగన్ ముఖ్యమంత్రి అవడం కూడా ఖాయమని జోస్యం చెప్పారు. వైఎస్సార్సీపీకి 120-130 సీట్లు వస్తాయని - ఎంపీ సీట్లు 22-23 వస్తాయని అన్నారు.
ఒకవైపు అధికారం మాదే అని వైసీపీ శ్రేణులు భావిస్తుండగా.. అభివృద్ధి చేశాం - ప్రజల ఓటు మాకే అని చంద్రబాబు వర్గం ధీమాగా ఉంది. ఎవరి ధీమాలో వారు ఉంటే... టీఆర్ఎస్ మాత్రం జగన్ దే గెలుపు అంటోంది. ఇంకా ఆయన ఏమన్నారంటే.. *చంద్రబాబు చరిత్ర నా దగ్గరుంది. అమరావతికి పారిపోయిన దొంగ చంద్రబాబు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం ఖాయం. ఏపీలో వైసీపీదే అధికారం* అని వ్యాఖ్యానించారు.
ఇక తెలంగాణ ఫలితాల గురించి మాట్లాడుతూ ... దేశంలో బీజేపీ - కాంగ్రెస్ ల ప్రజల నమ్మకాన్ని కోల్పోయాయని తలసాని సూత్రీకరించారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన పట్ల తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని - తెలంగాణలో కాంగ్రెస్ భూస్థాపితమైందని... ఆ పార్టీ నేతలకు చేతకాక తమపై ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు.
బీజేపీ గురించి తలసాని సీరియస్ కామెంట్లు చేశారు. టీఆర్ ఎస్ 16 ఎంపీ సీట్లు గెలిస్తే... కేంద్రం మెడలు వంచి తెలంగాణకు రావాల్సిన నిధులు - వాటాలు సాధిస్తామన్నారు తలసాని. అయితే, తలసాని అంచనాలు టైమ్స్ నౌ ఫలితాలను పోలి ఉండటం గమనార్హం.