Begin typing your search above and press return to search.
బాబు ఇంటికి తలసాని రూ.3కోట్లు ఇస్తాడంట
By: Tupaki Desk | 29 Sep 2015 10:23 AM GMTఏదో పాలు.. పెరుగు అమ్ముకొని బతుకుతున్నామంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేశ్ వెల్లడించిన తమ ఆస్తుల లెక్కపై తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోన చంద్రబాబు పేరు మీదున్న 1,125 గజాల ఇంటికి లోకేశ్ బాబు చెప్పిన లెక్క రూ.23.2లక్షలుగా పేర్కొనటం తెలిసిందే. జూబ్లీహిల్స్ లాంటి ఫ్రైమ్ ఏరియాలో ఉన్న ఇంటిని లక్షల్లో చెప్పిన వైనం పలువుర్ని విస్మయానికి గురి చేసింది. ఇదిలా ఉంటే.. ఏ చిన్న అవకాశం వచ్చినా తమ పార్టీ నుంచి జంప్ అయి.. తెలంగాణ సర్కారులో మంత్రిగా పని చేస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ పై తమ్ముళ్లు విరుచుకుపడటం తెలిసిందే.
తనపై టార్గెట్ చేసిన చంద్రసేన మీద దండెత్తేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తున్న తలసానికి బాబు ఆస్తుల వ్యవహారంపై తాజాగా స్పందించారు. బాబు ఆస్తుల ప్రకటన అంతా ఒట్టిదేనని.. రూ.23లక్షలు చెబుతున్న బాబు ఇంటికి తాను రూ.3కోట్లు ఇస్తానని.. అమ్ముతారా? అని ప్రశ్నించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. జగన్ కు చెందిన మీడియాలో సదరు ఇంటి విలువ రూ.32 కోట్లుగా లక్ష్మీపార్వతి చెప్పిన లెక్కను ప్రచురించారు. అంటే.. మార్కెట్ లెక్కలో రూ.32కోట్ల ఆస్తిని బాబు పరివారం రూ.23.2లక్షలకు చూపించిందన్న విమర్శలు వినిపిస్తుంటే.. మరోవైపు అంత విలువైన ఆస్తిని తెలంగాణ మంత్రి తలసాని రూ.3కోట్లకు కొంటానని చెప్పటం గమనార్హం.