Begin typing your search above and press return to search.
తలసాని కొడుకు.. మాటలతో సార్ ని ఫ్లాట్ చేస్తున్నాడుగా?
By: Tupaki Desk | 1 April 2019 6:26 AM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును మాటలతో ఫుట్ బాల్ ఆడుకోవటంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాతనే ఎవరైనా. కలిసి ఉన్నప్పుడు బాబును తన మాటలతో ఆకాశానికి ఎత్తేసే కేసీఆర్.. తేడా వచ్చిన నాటి నుంచి పాతాళానికి తొక్కేసేలా ఎంతగా చెలరేగిపోతున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు.
బాబును మాటలతో చిత్రవధ చేయటంలో కేసీఆర్ తర్వాతి ప్లేస్ తెలంగాణ రాష్ట్ర మంత్రి.. ఒకప్పుడు బాబుకు ప్రియ శిష్యుడైన తలసాని శ్రీనివాస్ యాదవ్ గా చెప్పాలి. తెలంగాణ ఉద్యమంలో ఒక్కసారి కూడా జైతెలంగాణ అనకుండానే తెలంగాణ రాష్ట్రంలో వరుస పదవుల్ని సొంతం చేసుకునే అదృష్టవంతుడిగా ఆయనకు పేరుంది. తెలంగాణ ఉద్యమంలో తాము లాఠీలతో కొట్టించుకుంటే.. తలసాని అందుకు భిన్నంగా కులాశాగా ఉండేవారని.. అలాంటి ఆయనకే కాదు.. ఆయన కొడుక్కి కూడా ఛాన్సుల మీద చాన్సులు వస్తున్నాయని కొందరు గులాబీ నేతలు లోగుట్టుగా వాపోతుంటారు.
అయితే.. దేనికైనా టాలెంట్ ఉండాలని.. అలా ఉన్నోళ్లకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని చెప్పాలి తలసాని మీదా.. ఆయన కొడుకు మీదా ఆడిపోసుకునే వారు ఒక విషయాన్ని మిస్ అవుతున్నారు. మాటలతో అధినేత మనసును ఎలా దోచుకోవాలో సీనియర్ తలసానికి తెలిసినంత బాగా.. జూనియర్ తలసానికి కూడా బాగా తెలుసని చెప్పాలి. తాజాగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలే దీనికి నిదర్శనం.
పదహారు ఎంపీ సీట్లు తమ ఖాతాలోకి వేసినంతనే ఢిల్లీలో చక్రం తిప్పేది తానేనంటూ చెప్పే కేసీఆర్ మాటలకు తగ్గట్లే ఆయన అనుచర గణం కూడా చెలరేగిపోతున్నారు. మీరు 16 సీట్లు ఇస్తే.. మా సారు 116 సీట్లు చేస్తారని చెప్పిన గులాబీ నేతలు సైతం బిత్తర పోయేలా.. కొత్త వాదనను తెర మీదకు తెచ్చారు తలసాని సాయి కిరణ్.
అధినేతను ప్రసన్నం చేసుకోవాలంటే ఎలాంటి మాటలు మాట్లాడాలో కొత్తగా నేర్పిస్తున్న తలసాని కొడుకు మాటలు గులాబీ నేతలకు కొత్త పాఠాలుగా మారాయి. మీరు పదహారు సీట్లు ఇస్తే.. మా సారు దాన్ని 116గా చేస్తారన్న మాటల్లో లాజిక్ పెద్దగా కనిపించలేదన్న విషయాన్ని గుర్తించిన జూనియర్ తలసాని ఇప్పుడు దాన్ని కాస్త అప్ గ్రేడ్ చేశారు. మీరు పదహారు సీట్లు సారుకు ఇవ్వండి.. మా సారు వాటిని 216 సీట్లుగా మారుస్తారని చెప్పటం మొదలెట్టారు.
ఊరుకోవయ్య మీ బడాయి అంటూ ఎవరైనా తన మాటల్ని తప్పు పట్టే ప్రయత్నం చేస్తే. తన తీరుకు భిన్నంగా మరింత శాంతంగా.. అదేందన్నా.. సారు రెండు ఎంపీ సీట్లతోనే తెలంగాణ తీసుకొచ్చిండు.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా.. పదహారు ఎంపీ స్థానాలను 216 సీట్లుగా మార్చటం ఏమైనా కష్టమా? చెప్పండంటూ ప్రశ్నిస్తున్నారు. లాజిక్ గా ఉన్న తలసాని కొడుకు మాటల్ని ఎవరు మాత్రం తప్పు పట్టగలరు చెప్పండి?