Begin typing your search above and press return to search.
కేసీఆర్ కంటే తలసానే డేంజర్ గా ఉన్నాడే!
By: Tupaki Desk | 21 Feb 2019 7:21 AM GMTరెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబుని ఒక ఆట ఆడుకున్నారు తెలంగాణ సీఎం. మా రాజకీయాల్లో ఇన్ వాల్వ్ అయినందుకు ఏపీ రాజకీయాల్లో కూడా ఇన్ వాల్వ్ అవుతామని.. చంద్రబాబుకి కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని ప్రకటించారు. అందులో భాగంగా తన అనుచరుడు తలసానిని రంగంలోకి దింపారు. తలసాని కూడా సంక్రాంతికి ఏపీ వెళ్లడం - భారీ ర్యాలీ నిర్వహించడం అన్నీ చకచకా జరిగిపోయాయి.
సంక్రాంతి అయిపోయింది - కేసీఆర్ మంత్రివర్గ కూర్పులో బిజీ అయిపోయారు. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతానికి రిటర్న్ గిఫ్ట్ ని కాస్త పక్కనపెట్టారు. కానీ తలసాని మాత్రం ఏపీకి కేసీఆర్ ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్ గురించి ఏమాత్రం మర్చిపోలేదు. ఎక్కడైనా ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నా - ఎవరికైనా ఇంటర్వ్యూ ఇస్తున్నా.. చంద్రబాబు అనే పేరు వస్తే చాలు.. రిటర్న్ గిఫ్ట్ గురించే ప్రస్తావిస్తున్నాడు.
టీడీపీని కాదని టీఆర్ ఎస్ లోకి వెళ్లిన తర్వాత కూడా తలసాని కొన్నాళ్లు కామ్ గానే ఉన్నాడు. ఒక స్థాయి వరకే చంద్రబాబుని విమర్శించారు. కానీ ఎప్పుడైతే.. టీఆర్ ఎస్ ఎన్నికల్లో చంద్రబాబు ఇన్ వాల్వ్ అయ్యారో.. అప్పటినుంచి తలసానికి కూడా చంద్రబాబు పై కోపం పెరిగింది. దీనికి తోడు.. టీఆర్ ఎస్ నేతలతో ఎవరైనా టచ్ లో ఉంటే ఊరుకోను అనే బాబు వార్నింగ్ ఇచ్చేసరికి ఆయనపై కోపం కాస్తా కసిగా మారింది. అందుకే.. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే విషయంలో.. కేసీఆర్ కంటే తలసానే చాలా డేంజర్ గా ఉన్నాడు. బాబుగారికి గిఫ్ట్ ఇచ్చేవరకు నిద్రపోయేట్లు కన్పించడం లేదు.