Begin typing your search above and press return to search.
ఏపీపై ... తెలంగాణ తూటా తలసాని
By: Tupaki Desk | 17 Feb 2019 6:12 AM GMT" వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడికి రిటన్ గిఫ్ట్ ఖాయం. అందుకు ఏం చేయాలో అన్నీ చేస్తాం" ఈ మాటలు ఎవరన్నారో గుర్తుండే ఉంటుంది. అవును... నిజమే... మీ ఊహ కరెక్టే. ఈ మాటలన్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అందుకు తగ్గ ఏర్పాట్లు ప్రారంభించేసారు. ఈ రిటర్న్ గిఫ్ట్ లో భాగంగా ముందుగా బీసీ కులాలను తెలుగుదేశం పార్టీకి దూరం చేసే పనిని తలకెత్తుకున్నారు కల్వకుంట్ల వారు.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో జీసీలు తెలుగుదేశం పార్టీ పట్ల కాసింత వ్యతిరేకతతో ఉన్నారు. దాన్ని తనకు అనుకూలంగా మార్చుకుందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు కె.చంద్రశేఖర రావు. ఈ ప్రయత్నాల్లో భాగంగా ముందుగా తన అనుంగు అనుచరుడు, తన సహచర మంత్రి వర్గ సభ్యుడు తలసాని శ్రీనివాస యాదవ్ ను తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై ప్రయోగించే తొలి తూటాగా రంగంపైకి తీసుకువచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది స్నేహితులు, అత్యంత దగ్గరి బంధువులు ఉన్న తలసాని శ్రీనివాస యాదవ్ ను బీసీలు ముఖ్యంగా యాదవులు, గౌడ్, శెట్టి బలిజలను ఏకం చేసి వారందరిని చంద్రబాబు నాయుడికి దూరం చేసేందుకు తన ప్రయత్నాలు ప్రారంభించారు.
వారం రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాజధానితో పాటు గుంటూరు, విజయవాడల్లో రెండు రోజుల పాటు మకాం వేసిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తనకున్న స్నేహితులు, బంధువులను కలుసుకుని మంత్రాంగం జరిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి చర్యలు చేపట్టాలి.... తెలుగుదేశం పార్టీని ఎలా ఓడించాలి వంటి అంశాలపై తలసాని చర్చించినట్టు సమాచారం. తెలంగాఱలో రెండు రోజుల్లో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం అయ్యింది. తలసాని శ్రీనివాస యాదవ్ కూడా తొలి విడత మంత్రి వర్గ విస్తరణలో బెర్తు ఖాయం చేసుకున్నారంటున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, బాధ్యతల స్వీకరణ వంటి కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత తలసాని మరోసారి ఆంధ్రప్రదేశ్ లో పర్యటించి అక్కడ చక్కబెట్టాల్సిన అంశాలపై చర్చలు జరుపుతారని అంటున్నారు. నేరుగా వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడకపోయినా... తవారంతా ఆయనకే మద్దతు పలికేలా పావులు కదుపుతారంటున్నారు. తలసాని శ్రీనివాస యాదవ్ ఆంధ్రప్రదేశ్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ప్రయోగించే తొలి తూటాగా రాజకీయ పరిశీలకులు అభివర్ఱిస్తున్నారు.