Begin typing your search above and press return to search.

తలసాని...దానం మధ్య పోటాపోటి..!?

By:  Tupaki Desk   |   19 Dec 2018 4:26 AM GMT
తలసాని...దానం మధ్య పోటాపోటి..!?
X
తెలంగాణ ఎన్నికలు ముగిసాయి. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి తిరిగి అధికారాన్ని సాధించింది. ఎవరు ఊహించిన విధంగా భారీ స్దానాలు దక్కించుకుంది. ముఖ్యంగా మహాకూటమికి కలిసి వస్తుందనుకున్న జంట నగరాల ఫలితాలు కూడా తెలంగాణ రాష్ట్ర సమితికి అనుకూలంగానే వచ్చాయి. సెట్టిలర్లు తమవైపే ఉంటారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశించినా ఫలితం మాత్రం అందుకు విరుధ్దంగా ఉంది. సెట్టిలర్లు ఎక్కువగా ఉన్న మల్కజ్ గిరి - సనత్‌ నగర్ - కూకట్‌ పల్లి - శేరిలింగంపల్లి - ఖైరతాబాద్ నియోజకవర్గాలలో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులే విజయం సాధించారు. దీంతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధిపత్యానికి గండి కొట్టినట్లు అయ్యింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ఇది ఊహించని దెబ్బ. మరోవైపు అధికార పార్టీకి అధిక స్దానాలు వచ్చిన మంత్రులు పంపకాలలో మాత్రం తలనొప్పులు వచ్చేలా ఉంది. తెలంగాణ మంత్రి వర్గాన్ని తక్కువ మందితోనే సరిపెట్టాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు భావిస్తున్నారు.

తెలంగాణలో తొలివిడతగా ఎనిమిది నుంచి పది మందికి మాత్రమే మంత్రి వర్గంలో అవకాశం కనిపించాలని ముఖ్యమంత్రి కెసీఆర్ భావిస్తున్నారు. ఈ సమయంలో రాజధాని కోటాలో ఒకరికే అవకాశం వచ్చేలా ఉంది. ఆ ఒక్క పదవి తమకంటే తమకని తలసాని శ్రీనివాస యాదవ్ - దానం నాగేందర్ పోటీ పడతున్నారు. అంతేకాదు వీరిద్దరు కూడా తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావుపైనే ఆశలు పెట్టుకున్నారు. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో తలసాని శ్రీనివాస యాదవ్ - దానం నాగేందర్ చేసిన హంగామ అంతఇంత కాదు. భారీ ర్యాలీలు కూడా చేపట్టారు. మంత్రివర్గ విస్తరణలో తమకు ఛాన్స్ ఇప్పించాలంటూ ఈ ఇద్దరు నాయకులు కల్వకుంట్ల తారక రామారావు పై వత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అయితే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మాత్రం అటు సమాజిక వర్గంగాను - ఇటు సెట్టిలర్లను ఆనందపరిచేలా రాజధాని నుంచి గెలిచిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒకరికి మంత్రి పదవి ఇస్తారని పార్టీలో చర్చ జరుగుతోంది. ముఖ‌్యంగా తనపై కక్షతో కూకట్‌ పల్లి నుంచి నందమూరి కుటుంబం నుంచి ఒకరికి పోటీలోకి దింపిన చంద్రబాబు నాయుడికి గుణపాఠం చెప్పేందుకు అక్కడ గెలిచిన శాసన సభ్యుడికి మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు.