Begin typing your search above and press return to search.

త‌ల‌సాని.. కేటీఆర్ ను అలా బుక్ చేస్తావేంది?

By:  Tupaki Desk   |   30 Aug 2018 10:06 AM GMT
త‌ల‌సాని.. కేటీఆర్ ను అలా బుక్ చేస్తావేంది?
X
రాజ‌కీయం అన్నాక మాట‌ల దాడి మామూలే. ప్ర‌త్య‌ర్థులు విసిరే వ్యంగ్య‌స్త్రాల‌కు.. విమ‌ర్శ‌ల‌కు.. ఆరోప‌ణ‌ల‌కు ధీటుగా స‌మాధానం ఇచ్చేందుకు మాట‌ల్లో మ‌సాలాను క‌ల‌ప‌టం మామూలే. అయితే.. ఈ ప్ర‌య‌త్నంలో ఎక్క‌డా తేడా దొర్ల‌కూడ‌దు. కానీ.. తెలంగాణ రాష్ట్ర మంత్రి త‌ల‌సాని మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించిన వైనం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

ఊహించ‌నిరీతిలో ప‌క్కా ప్లాన్ తో ముంద‌స్తుకు వెళ్లేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్లాన్ చేసిన నేప‌థ్యంలో.. ఆ వేగానికి త‌ట్టుకోలేక‌పోతున్న కాంగ్రెస్ నేత‌లు కిందా మీదా ప‌డిపోతున్నారు. విప‌క్షంగా త‌మ‌కుండే ఎడ్జ్ ను వినియోగించ‌టంలో దొర్లుతున్న త‌ప్పుల్ని కాచుకుంటూ ఎదురుదాడి షురూ చేశారు.

దీంతో.. ఇలాంటి వాటిపై రియాక్ట్ అయ్యేందుకు రెఢీగా గులాబీ ద‌ళం చెల‌రేగిపోతోంది. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా మాట‌ల్ని వాడేస్తున్నారు. టీఆర్ఎస్ నేత‌ల‌కు మొద‌ట్నించి ఒక అల‌వాటు ఉంది. ఉద్య‌మ బ్యాక్ గ్రౌండ్ నేప‌థ్యంలో పెద్ద పెద్ద నేత‌ల్ని సైతం మాట అనేయ‌టంలో ప్ర‌త్యేక‌మైన ప్రావీణ్యం గులాబీ నేత‌లకు ఉంది.

త‌న తండ్రికి గురువైన చంద్ర‌బాబును కేటీఆర్ రెట్టించిన ఉత్సాహంతో విరుచుకుప‌డ‌టం ఉద్య‌మ కాలం నుంచి ఉన్న‌దే. ఒక్క కేటీఆర్ మాత్ర‌మే కాదు.. టీఆర్ఎస్ కు చెందిన ప‌లువురు నేత‌లు అదే తీరును ప్ర‌ద‌ర్శించేవారు. తాజాగా రాహుల్ ను.. సోనియాను ల‌క్ష్యంగా చేసుకొని విమ‌ర్శ‌నాస్త్రాల్ని సంధిస్తున్నారు. ఎవ‌రు అవున‌న్నా కాద‌న్నా తెలంగాణ ప్ర‌జ‌ల క‌ల‌ను సాకారం చేసింది సోనియాగాంధీనే.

ఆమె నుంచి తెలంగాణ‌ను తాము లాక్కున్న‌ట్లు గులాబీ నేత‌లు చెప్పినా.. ఆ రోజున సోనియా మైండ్ సెట్ ఏ మాత్రం వేరుగా ఉండి.. టీఆర్ఎస్ సంగ‌తి చూడాల‌న్న మాట‌ను చెప్పినా.. క‌నుసైగ చేసినా ప‌రిస్థితి ఎలా ఉండేదో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అలాంటి సోనియాను బొమ్మ అంటూ ఎట‌కారం ఆడేశారు కేటీఆర్‌. త‌మ‌కు మించిన నేత‌ల్ని విమ‌ర్శించ‌టం ద్వారా త‌మ స్థాయిని పెంచుకునే అల‌వాటు టీఆర్ఎస్ నేత‌ల‌కు మొద‌ట్నించి ఉన్న‌దే.
ఈ అలవాటును కొత్త‌గా అల‌వ‌ర్చుకునే క్ర‌మంలో మంత్రి త‌ల‌సాని చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మార‌ట‌మే కాదు.. విపక్షాల చేతికి అవ‌కాశం ఇచ్చేలా ఉన్నాయ‌న్న మాట వినిపిస్తోంది.

మంత్రి కేటీఆర్ బ‌చ్చా అని ఉత్త‌మ్ అంటున్నార‌ని.. ఆయ‌న పార్టీ అధినేత రాహుల్ కూడా బ‌చ్చానే అన్న సంగ‌తి మ‌ర్చిపోకూడ‌ద‌ని వ్యాఖ్యానించారు. రాహుల్ అచ్చానా? బ‌చ్చానా? అన్న‌ది త‌ర్వాత‌.. ఆ విషయాన్ని వేరుగా తేల్చుకోవాలే కానీ.. మ‌ధ్య‌లో కేటీఆర్ ప్ర‌స్తావ‌న తీసుకురావాల్సిన అవ‌స‌రం త‌ల‌సానికి ఎందుకు? అన్న ప్ర‌శ్న వినిపిస్తోంది. నిజ‌మే.. జాతీయ స్థాయిలో చూసిన‌ప్పుడు రాహుల్ బ‌చ్చానే అనుకుంటే.. కేటీఆర్ కూడా బ‌చ్చా అయిపోవాల్సి ఉంటుంద‌న్న చిన్న‌పాటి లాజిక్ మ‌ర్చిపోవ‌టం ఏమిట‌న్న‌ది త‌ల‌సానిని ఉద్దేశించి ప్ర‌శ్నిస్తున్నారు. ఎదుటోడి మీద బుర‌ద వేసేట‌ట్లుగా మాట‌లు ఉండాలే కానీ..త‌మ మాట‌ల్నే అస్త్రాలుగా చేసుకొని ఎదురుదాడి చేసేలా ఉండ‌కూడ‌ద‌న్న క‌నీస విష‌యాన్ని త‌ల‌సాని మిస్ అయ్యార‌న్న మాట వినిపిస్తోంది.