Begin typing your search above and press return to search.

జగన్ రూట్ మ్యాప్ వేసిన వ్యక్తికి కేబినెట్ హోదా

By:  Tupaki Desk   |   23 Jun 2019 6:04 AM GMT
జగన్ రూట్ మ్యాప్ వేసిన వ్యక్తికి కేబినెట్ హోదా
X
తలశిల రఘురాం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడు ఎటు వెళ్లాలో డిసైడ్ చేసిన వ్యక్తి. జగన్ మోహన్ రెడ్డి చేసిన సుదీర్ఘ పాదయాత్రకు రూట్ మ్యాప్ ను అంతా రెడీ చేసింది తలశిల రఘురాం. ఏయే నియోజకవర్గాల వారీగా పాదయాత్రను సాగించాలి, ఎలా వెళితే ఎక్కువ మంది ప్రజలను కలవడానికి, ఎక్కువ నియోజకవర్గాలను కవర్ చేస్తూ రాష్ట్రం మొత్తం పర్యటన పూర్తి చేయొచ్చు.. అనే అంశం గురించి బాగానే కసరత్తు చేశారు తలశిల.

జగన్ మోహన్ రెడ్డి చేసిన సుదీర్ఘ పాదయాత్రలో అలా ప్రణాళిక రచనతో కీలక పాత్ర పోషించారు తలశిల. ఇప్పుడు ఆయనకు కేబినెట్ ర్యాంకుతో పదవి దక్కడం గమనార్హం. సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ గా నియమితం అయ్యారు తలశిల రఘురాం. ఇది కూడా సలహాదారు తరహా పదవే.

తలశిల రఘురాంతో పాటు.. ఇటవలే సీఎం సలహాదారుల్లో ఒకరిగా నియమితం అయిన జీవీడీ కృష్ణమోహన్ కు కూడా కేబినెట్ ర్యాంకు దక్కింది. ఈ మేరకు సీఎస్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏపీ ప్రభుత్వ కమ్యూనికేషన్స్ సలహాదారుగా జీవీడీ నియమితం అయిన సంగతి తెలిసిందే.