Begin typing your search above and press return to search.
జగన్ విశ్రమించినా... తలశిల మేల్కోక తప్పదు!
By: Tupaki Desk | 6 Nov 2017 12:32 PM GMT2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్రకు నేటి ఉదయం శ్రీకారం చుట్టారు. తన సొంత జిల్లా కడపలో తన తండ్రి సమాధి ఉన్న ఇడుపులపాయ క్షేత్రంగా ప్రారంభమైన ఈ యాత్ర 6 నెలల పాటు సుదీర్ఘంగా కొనసాగనుంది. 3 వేల కిలో మీటర్లకు పైగా కొనసాగే ఈ యాత్రలో జగన్ మొత్తం రాష్ట్రాన్నే చుట్టేయనున్నారు. నవ్యాంధ్రలోని అన్ని జిల్లాల మీదుగా కొనసాగే ఈ యాత్ర... చివరగా శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో ముగియనుంది. అంటే ఈ ఆరె నెలల పాటు జగన్ ప్రజాక్షేత్రంలోనే ఉంటారన్నమాట. అయితే ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి ప్రతి శుక్రవారం హైదరాబాదు నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో జరిగే విచారణకు జగన్ తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంది. ఈ విషయంలో తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న జగన్ అభ్యర్థనను సీబీఐ కోర్టు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. అంటే ఆరు నెలల పాటు నాన్ స్టాప్ గా పాదయాత్ర చేపట్టేందుకు జగన్ కు అవకాశమే లేదన్న మాట. గురువారం రాత్రి పాదయాత్ర ముగించుకుని శుక్రవారం కోర్టుకు హాజరై... ఆ తర్వాత తిరిగి శనివారం జగన్ పాదయాత్రను మొదలుపెడతారు. అంటే జగన్ కు వారానికి ఓ రోజు రెస్ట్ దొరికినట్టే లెక్క.
పాదయాత్ర చేసే జగన్ కు కోర్టు విచారణ పేరిట రెస్ట్ దొరికినా... ఒక్క వ్యక్తికి మాత్రం నిజంగానే రెస్ట్ లేదనే చెప్పాలి. అయినా పాదయాత్ర చేసే జగన్ కు రెస్ట్ దొరికినా... ఆ వ్యక్తికి ఎందుకు రెస్ట్ దొరకదంటే... ఈ పాదయాత్రకు రూపశిల్పి ఆయనే మరి. అందుకే జగన్ విశ్రమించినా... ఆ రూపశిల్పికి మాత్రం రెస్ట్ లేదనే చెప్పాలి. అయినా ఆ రూపశిల్పి ఎవరనే కదా మీ ప్రశ్న? ఆయన ఎవరో కాదు... వైసీపీ ప్రోగ్రామ్స్ కమిటీలో కీలక సభ్యుడిగా ఉన్న పార్టీ యువ నేత తలశిల రఘురాం. ఈ పేరు ఎక్కడో ఉన్నట్టుంది అనుకుంటున్నారు కదూ. నిజమే వైఎస్ జగన్ సుదీర్ఘంగా చేపట్టిన ఓదార్పు యాత్ర, ఆ తర్వాత జగన్ జైలులో ఉన్న సందర్భంగా ఆయన సోదరి వైఎస్ షర్మిళ చేపట్టిన పాదయాత్రలకు రూపకల్పన చేసింది కూడా తలశిల రఘురామే. పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా... అక్కడ తలశిల ప్రత్యక్షం అయిపోతారు. అందుకేనేమో... నేటి ఉదయం ఇడుపులపాయలో జగన్ ప్రసంగిస్తుండగా... ఆయన వెనుకాలే నిలబడిపోయారు. తెర వెనుకే ఉండే తలశిల ప్రణాళిక, కార్యాచరణ నిజంగానే అద్భుతమనే చెప్పాలి.
ఏనాడూ ప్రచారం కోరుకోని తలశిల... పార్టీకి చెందిన ప్రధాన ఘట్టాల్లో మాత్రం అందరికంటే ముందు వరుసలో నిలుస్తారు. ఇప్పుడు జగన్ ప్రారంబించిన ప్రజా సంకల్ప యాత్రకు కూడా తలశిల రఘురామే రూపకర్త. రూపకర్త అంటే... పాదయాత్ర ఏ మార్గంలో సాగితే... సాధ్యమైనన్ని నియోజకవర్గాలను తాకొచ్చు? ఎక్కడెక్కడ బహిరంగ సభలు పెట్టాలి? ఎక్కడెక్కడ జగన్ విశ్రమించాలి? రోజుకు ఎన్ని గంటలు నడిస్తే సరిపోతుంది? ఆయా ప్రాంతాలకు చెందిన ముఖ్య నేతలను జగన్ వద్దకు తీసుకెళ్లడమెలా? బహిరంగ సభలకు ఏర్పాట్లు ఎలా? ఇలా అన్నింటినీ తలశిల రఘురామే చూసుకుంటారన్న మాట. అంటే మొత్తంగా పాదయాత్ర మొత్తం తలశిల రఘురాం భుజస్కందాలపైనే నడుస్తుందన్న మాట. అందుకే జగన్ విశ్రమించినా... తలశిలకు మాత్రం రెస్ట్ లేదన్నమాట.
ఇక తలశిల ఏ ప్రాంతానికి చెందిన వారన్న విషయానికి వస్తే... కృష్ణా జిల్లాలోని ప్రధాన నగరం విజయవాడ శివారులోని గొల్లపూడి మండలానికి చెందినవారే తలశిల. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో క్రియాశీలంగా మారిపోయిన రఘురాం... దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి వీరాభిమాని. యువకుడిగా ఉన్నప్పుడే 1993లో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తలశిల... ఆ తర్వాత వైఎస్‌కు ఫ్యామిలీకి మరింతగా దగ్గరయ్యారు. వైఎస్ మరణించడం, ఆ తర్వాత జగన్ వేరు కుంపటి పెట్టేయడంతో వైఎస్ ఫ్యామిలీపై ఉన్న అభిమానంతో తలశిల కూడా వైసీపీలో చేరిపోయారు. ఇప్పుడు పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీలో సభ్యుడిగా ఆయన కొనసాగుతున్నారు. పేరుకు కమిటీలో మెంబరే గానీ... ఆ కమిటీ మొత్తం బాధ్యతలను కూడా తలశిలనే పర్యవేక్షిస్తున్నారని పార్టీ నేతలు చెబుతుంటారు.