Begin typing your search above and press return to search.
కాశ్మీర్ పై తాలిబన్, ఆల్ ఖైదా కన్ను
By: Tupaki Desk | 4 Sep 2021 9:02 AM GMTఅందరు అనుమానిస్తున్నట్లుగా మనదేశంపై తాలిబన్లు, ఆల్ ఖైదా కన్నేశాయి. పోయిన నెల 15వ తేదీన ఆప్ఘనిస్ధాన్ను తాలిబన్లు ఆక్రమించుకున్న విషయం తెలిసిందే. భారత్ విషయంలో తాలిబన్లు ఇప్పటివరకు చెప్పిన మాటలన్నీ నీటి మూటలే అని తేలిపోయింది. తాలిబన్లు ఆఫ్ఘన్ను చెరపట్టినప్పటి నుంచి అంతర్జాతీయ పరిణామాలు చకచక మారిపోతున్నాయి. అయితే ప్రపంచంలోని మిగిలిన దేశాలకన్నా తీవ్రవాదుల నుంచి ముప్పు మన దేశానికే చాలా ఎక్కువుంది.
ఇప్పటికే తీవ్రవాదంతో ఇబ్బంది పడుతున్న మనదేశ భద్రతకు ఆఫ్ఘన్లో మొదలైన పరిణామాలు మరింతగా ప్రమాదకరంగా మారుతాయనే ఆందోళన పెరిగిపోతోంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే మనదేశానికి దాయాది దేశం పాకిస్తాన్ కు ఏమాత్రం పడకపోవటమే. మనదేశంలో ఎక్కడ ఎలాంటి తీవ్రవాద చర్యలు జరిగినా దాని మూలాలు పాకిస్ధాన్ వైపు వేళ్ళు చూపుతున్నాయి. పాకిస్థాన్ తోనే వేగ లేక నానా అవస్థలు పడుతుంటే దాయాదికి డ్రాగన్ అదనంగా చేరింది.
ఇదే సమయంలో తాజాగా తాలిబన్లు మాట్లాడుతూ కాశ్మీర్లోని ముస్లింల తరపున పోరాటాలు చేస్తామంటు ప్రకటించటం గమనార్హం. ఈమధ్యనే ఆల్ ఖైదా తీవ్రవాదులు మాట్లాడుతూ కాశ్మీర్ ముస్లింల తరపున పోరాటాలు చేయటానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అప్పుడు ఆల్ ఖైదాకు మద్దతుగా తాలిబన్ల తరపున ఎలాంటి మద్దతు రాలేదు. అయితే ఓ నాలుగు రోజుల తర్వాత తాలిబన్లు కూడా సేమ్ అలాంటి ప్రకటనే చేయటంతో అందరి దృష్టి ఇపుడు కాశ్మీర్ వైపు మళ్ళుతోంది.
అంటే పాకిస్థాన్ ప్రేరేపిత తీవ్రవాదులకు ఆల్ ఖైదా, తాలిబన్ల మద్దతుంటుందన్న విషయం స్పష్టంగా అర్ధమైపోయింది. ఇప్పటికే జమ్మూ-కాశ్మీర్ ను ఎంతలా కంపు చేయాలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అంతా చేస్తున్నారు. వీళ్ళను తట్టుకోవటమే మనకు చాలా కష్టంగా ఉంది. అలాంటిది ఆల్ ఖైదా, తాలిబన్లు కూడా తోడైతే మనకు మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేదు. ఈ పరిస్ధితి రాకుండా ఉండటానికే తాలిబన్లు ఆహ్వానిస్తే ఖతార్ లోని మన రాయబారి దీపక్ తాలిబన్లతో చర్చలు జరిపారు.
ఆ చర్చల్లో భారత్ విషయంలో తాము జోక్యం చేసుకునేది లేదని స్పష్టంగా ప్రకటించిన తాలిబన్లు తాజాగా యూ టర్న్ తీసుకుని కాశ్మీర్ ముస్లింల తరపున పోరాటాలు చేస్తామని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. అంటే రెండు ప్రమాధకరమైన తీవ్రవాద గ్రూపుల ప్రకటనల నేపథ్యంలో మన సైన్యం ఇప్పటికన్నా మరింత కేర్ ఫుల్ గా ఉండాలనేది అర్ధమవుతోంది. ఎందుకంటే పాకిస్ధాన్ ప్రేరేపిత తీవ్రవాదుల కన్నా ఆల్ ఖైదా, తాలిబన్లు మరింత ప్రమాదకారులు కాబట్టే.