Begin typing your search above and press return to search.
తాలిబన్ల అరాచకాలకు అంకురార్పణ..సెక్స్ బానిసలుగా మహిళలు !
By: Tupaki Desk | 21 Aug 2021 9:45 AM GMTఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ల అరాచకాలు మళ్లీ ప్రారంభమయ్యాయి.అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందినట్లుగానే మహిళల పట్ల తాలిబన్లు అత్యంత క్రూరంగా వ్యవహరిస్తున్నారు.పైకి శాంతి వచనాలు వల్లిస్తూనే మహిళలు, సామాన్యుల పట్ల హింసకు పాల్పడుతున్నారు. తాజాగా అంతర్జాతీయ మీడియాతో మాట్లాడిన నజ్లా అయౌబి అనే ఆఫ్గనిస్తాన్ మాజీ న్యాయవాది,ఎవ్రీ వుమెన్ ట్రీటి సంస్థ చీఫ్ అక్కడి మహిళల ధీన స్థితి గురించి బాహ్య ప్రపంచానికి తెలియపరిచారు. నిత్యం మహిళ హక్కుల కోసం గొంతెత్తున్న తాను, తన ప్రాణాలు కాపాడుకునేందుకు ఇప్పటికిప్పుడు దేశం విడిచి పారిపోవాలనుకుంటున్నట్లు తెలిపారు.
తాలిబన్ల అరాచకాల గురించి చెబుతూ, ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలను నజ్లా అయౌబి ఉదహరించారు. తాలిబన్ ఫైటర్లకు వంట సరిగా చేయలేదనే కారణంతో ఓ మహిళను సజీవదహనం చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్ లో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో తిండికి కూడా ప్రజలు అలమటిస్తున్నారని, ఇలాంటి తరుణంలో తాలిబన్లు తమకు తిండి పెట్టాలని స్థానికులను వేధిస్తున్నారని, హింసిస్తున్నారని చెప్పారు. అంతేకాదు,గత కొద్ది వారాలుగా ఎంతోమంది యువతులను శవపేటికల్లో పొరుగు దేశాలకు తరలిస్తున్నారని చెప్పారు. వారిని సెక్స్ బానిసలుగా వాడుకునేందుకే ఇలా తరలిస్తున్నారని తెలిపారు.
ఆడపిల్లలు ఉన్న కుటుంబాలను తాలిబన్లు వేధింపులకు గురిచేస్తున్నారని నజ్లా అయౌబి తెలిపారు. మీ కూతుళ్లను తమకిచ్చి పెళ్లి చేయాలని బలవంతం చేస్తున్నారని చెప్పారు. ఓవైపు ఇస్లామిక్ షరియా చట్టాలకు లోబడి మహిళలకు విద్య,ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెబుతూనే, మరోవైపు ఇలాంటి అరాచకాలకు తెగబడటమేంటని ప్రశ్నించారు. తాలిబన్ల పాలనలో జీవితమొక కాళరాత్రిగా మారిపోయిందన్నారు. తాలిబన్ల రాకకు ముందు రోజు వరకు తాను శక్తివంతమైన స్థానంలో ఉన్నానని... ఇప్పుడు తన స్థానం నథింగ్ అని వాపోయారు.
ఇటీవలే షబ్నమ్ అనే ఓ మహిళా జర్నలిస్ట్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఆఫ్గన్ మళ్లీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడంతో తాను ఉద్యోగం కోల్పోయినట్లు తెలిపారు. తాను పనిచేసే టీవీ ఛానెల్ వారు ఇక తనను ఆఫీస్ కు రావొద్దని చెప్పారని అన్నారు. తాను ఆఫీస్ వద్దకు వెళ్లగా లోపలికి రానివ్వలేదని, కేవలం పురుషులను మాత్రమే అనుమతిస్తున్నట్లు చెప్పారని వెల్లడించారు. తాలిబన్ల పాలనతో వ్యవస్థ మారిపోయిందని, ఇక తనను ఆఫీస్ కు రావొద్దని చెప్పారన్నారు. ఆఫ్గన్ లో మహిళా హక్కులపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న వేళ ఓ మహిళా జర్నలిస్ట్ దీనిపై తాలిబన్లనే సూటిగా ప్రశ్నించింది.
తాలిబన్ల పాలనలో మహిళా నాయకులకు ఓటు వేసే అవకాశం ప్రజలకు ఇస్తారా అని అడిగింది. అందుకు వారు, అదో పిచ్చి ప్రశ్న అన్నట్లుగా ఎగతాళి నవ్వు నవ్వారు. అంతేకాదు,కెమెరా ఆఫ్ చేయాలని హుకుం జారీ చేశారు. దీంతో ఆ మహిళా జర్నలిస్ట్ మరో మాట మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లాల్సి వచ్చింది. ఓవైపు మహిళల పట్ల ఇంత హింసకు పాల్పడుతూనే, తాము ఎవరికీ హాని తలపెట్టమని తాలిబన్లు శాంతి వచనాలు వల్లె వేస్తున్నారు. ఆఫ్గన్ ను చేజిక్కించుకున్నాక నిర్వహించిన మొదటి ప్రెస్ మీట్ లో.. 'ఇక నుంచి ఆఫ్గనిస్తాన్ లో ఎలాంటి యుద్ధం ఉండదు. అశాంతికి ఆస్కారం లేదు. ఏ దేశంతోనూ మేము యుద్ధాన్ని కోరుకోవట్లేదు. మాకు ఎవరిపైనా పగ లేదు. మేమెవరినీ శత్రువుల్లా భావించట్లేదు. విదేశీ విధానాలను అమలుచేసిన మాజీ సైనిక సభ్యులతో పాటు అందరినీ క్షమించేశాం అని అన్నారు. తాలిబన్ల మాటలు చాలా ఉదారంగా కనిపించినప్పటికీ... వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు విరుద్దంగా ఉన్నాయి.
అందరి హక్కులు,రక్షణకు తాలిబన్లు హామీ ఇస్తున్నప్పటికీ ఆఫ్గన్ ప్రజల్లో నమ్మకం కుదరడం లేదు. ఆఫ్గన్ లో తొలి మహిళ మేయర్ అయిన 29 ఏళ్ల జరిఫా గఫారీ తనను తాలిబన్లు చంపేస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆఫ్గన్ లో మహిళల సాధికారత కోసం ఆమె కృషి చేశారు. అక్కడి మహిళలకు ఆదర్శంగా నిలిచారు. 2019లో బీబీసీ రూపొందించిన టాప్ 100 ప్రభావవంతమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకున్నారు. 2020లో అమెరికా విదేశాంగ శాఖ జరిఫాను ఇంటర్నేషనల్ విమెన్ ఆఫ్ కరేజ్ అవార్డుకు ఎంపిక చేసింది. ప్రస్తుతం ఆఫ్గన్ లో పరిస్థితులు చూసి ఆమె తల్లడిల్లిపోతున్నారు. జరిఫా మేయర్ గా బాధ్యతలు చేపట్టిన మొదటిరోజే ఆమెను చంపేస్తామని తాలిబన్లు హెచ్చరించాయి. పలుమార్లు హత్యాయత్నం కూడా జరిగింది. ఆమె తండ్రిని కూడా చంపేశారు. ఇప్పుడు ఆఫ్గన్ మరోసారి తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడంతో ఆమె తీవ్ర ఆందోళన చెందుతున్నారు.