Begin typing your search above and press return to search.

తాలిబన్ల వింత చేష్టలపై కీలక ఆదేశాలు

By:  Tupaki Desk   |   18 Aug 2021 6:30 AM GMT
తాలిబన్ల వింత చేష్టలపై కీలక ఆదేశాలు
X
అప్ఘనిస్తాన్ ను తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్ల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. కాబూల్ రాజధాని నగరంలో ఇష్టమొచ్చినట్టుగా ప్రవర్తిస్తూ రెచ్చిపోతున్నారు. తాలిబన్ల వింత చేష్టలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతర్జాతీయ మీడియా తాలిబన్ల వీడియోలను ప్రసారం చేస్తూ ఈ దమనకాండను ఖండిస్తోంది. ప్రజల్లోనూ దీనిపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

తాలిబన్ల వింత చేష్టల వీడియోలు వైరల్ కావడంతో తమ సేనలకు తాలిబన్ సంస్థ కీలక ఆదేశాలు జారీ చేసింది. క్రమశిక్షణతో నడుచుకోవాలని తమ సాయుధ బలగాలను ఆదేశించినట్లు ఓ సీనియర్ తాలిబన్ అధికారి రాయిటర్స్ సంస్థకు తెలిపారు.

అప్ఘనిస్తాన్ లో ఖాళీ అయిన ఏ దేశ ఎంబెసీలోకి తాలిబన్ సైన్యం ప్రవేశించవద్దని వారి అధినేతలు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. అలాగే విదేశీ ఎంబసీ భవంతులకు ఎలాంటి హాని తలపెట్టవద్దని సూచించారు. అలాగే విదేశీ దౌత్య కార్యాలయాలకు సంబంధించిన వాహనాలను కూడా అడ్డుకోవద్దని ఆదేశాలిచ్చారు.

ఇక ఇప్పటికే అమెరికా సహా నాటో దేశాలు అప్ఘన్ లోని తమ సిబ్బందిపై తాలిబన్లు అఘాయిత్యాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరికలు పంపాయి. ఈ నేపథ్యంలోనే తాలిబన్ సంస్థ ఏ విదేశీ దౌత్యకార్యాలయంలోకి వెళ్లొద్దని తమ సాయుధ సేనలకు ఆదేశాలు జారీ చేసింది.

కాబూల్ ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు.. అప్ఘనిస్తాన్ పార్లమెంట్ భవంతి, అధ్యక్ష భవంతిలో తుపాకులు చేతబట్టి వీడియోల్లో దర్శనమివ్వడం..దర్జాగా రాజభోగాలు అనుమవించడం వైరల్ అయ్యింది. దీనిపై అంతర్జాతీయ మీడియాలో తాలిబన్లపై విమర్శలు వెల్లువెత్తాయి.

తాలిబన్ల ఫొటోలు, వీడియోలు