Begin typing your search above and press return to search.

తాలిబన్లు హక్కానీ నేతలతో ఘర్షణ .. బరాదర్ చనిపోయాడంటూ ప్రచారం!

By:  Tupaki Desk   |   14 Sep 2021 10:21 AM GMT
తాలిబన్లు హక్కానీ నేతలతో ఘర్షణ ..  బరాదర్ చనిపోయాడంటూ  ప్రచారం!
X
అఫ్గనిస్థాన్‌‌లో తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు విషయంలో రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. మిత్రపక్షం హక్కానీ నెట్‌ వర్క్‌ తో విబేధాల వల్లే ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరిగిందని, రెండు వర్గాలు ఘర్షణపడటంతో తాలిబన్ సహ-వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ గాయపడ్డారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన చనిపోయాడని సోషల్ మీడియాలో ముమ్మర ప్రచారం జరుగుతోంది. తాలిబన్ తాత్కాలిక ప్రభుత్వ డిప్యూటీ ప్రధానిగా ఉన్న బరాదర్‌ మృతిచెందినట్లు కొన్ని పోస్టులు వైరల్‌ అవుతున్నాయి. అధ్యక్ష భవనంలో ప్రత్యర్థి వర్గాలతో జరిగిన ఘర్షణలో బరాదర్ గాయపడి, అనంతరం మరణించినట్లు స్థానిక మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి.

దీనితో తన తన మరణ వార్తలను ఘనీ బరాదర్‌ ఖండించారు. తాను క్షేమంగానే ఉన్నానని, ఏమీ కాలేదని తాజాగా ఓ ఆడియోను ఆయన విడుదల చేశారు. అదంతా తప్పుడు ప్రచారమని ఆయన తెలిపారు. నేను చనిపోయినట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి.. గత కొన్ని రోజులుగా నేను ప్రయాణాలలో ఉన్నాను. ప్రస్తుతం నేను ఎక్కడ ఉన్నా మేమంతా బాగున్నాం అని ఆడియోలో వెల్లడించారు.

ఆఫ్ఘనిస్తాన్‌ డిప్యూటీ ప్రధానిగా ప్రకటించుకున్న ముల్లా బరాదర్‌ చనిపోయినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని అంటున్నారు తాలిబన్లు. అంతర్గత కలహాలతో ముల్లాబరాదర్‌ను ప్రత్యర్ధి వర్గం చంపినట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కరోనా మహమ్మారి తో చనిపోయినట్టు కూడా వార్తలు వచ్చాయి.

అయితే ఈ వార్తల్లో నిజం లేదని ఆడియో సందేశాన్ని విడుదల చేశాడు ముల్లా బరాదర్‌. అమెరికా బలగాలు, అఫ్గానిస్థాన్‌ సైనికుల కళ్లుగప్పి తాను ఏళ్లపాటు కాబుల్‌లోనే ఉన్నానని తాలిబన్‌ అధికార ప్రతినిధి జబియుల్లా ముజాహిద్‌ తెలిపారు. తాను కాందహార్‌ లో ఉన్నానని తెలిపారు బరాదర్‌. త్వరలోనే ఆఫ్ఘన్‌ ప్రజల ముందుకు వస్తానని తెలిపారు. ప్రధాని ముల్లా మహ్మద్‌ హసన్‌ అఖుండ్‌ వర్గానికి బరాదర్‌ వర్గానికి ఘర్షణలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. తనను కాదని అఖుండ్‌ ను ప్రధానిగా ప్రకటించడంపై బరాదర్‌ ఆగ్రహంతో ఉన్నట్టు చెబుతున్నారు. గత నెల్లో తాలిబన్లు కాబుల్‌ ను ఆక్రమించుకున్నాక మీడియా ముందుకు వచ్చారు. అప్పటి నుంచి విలేకర్ల సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

తను అజ్ఞాతంలో ఉన్నప్పటి వివరాలను తాజాగా ఓ వార్తాసంస్థతో ముఖాముఖిలో ఆయన వెల్లడించారు. వాయవ్య పాకిస్థాన్‌ లోని నౌషెరాలో ఉన్న హక్కానియా విద్యాలయంలో తాను చదువుకున్నట్లు చెప్పారు. తాలిబన్‌ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్‌ను తానెప్పుడూ చూడలేదని ఆయన చెప్పారు. ఒమర్‌ వారసులైన షేక్‌ ముల్లా మన్సూర్, షేక్‌ హెబతుల్లాల నాయకత్వంలోనే పనిచేసినట్లు తెలిపారు.ఆఫ్ఘన్‌ లో తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటు తరువాత బరాదర్‌ తో పాటు మరో కీలక నేత అన్నీస్‌ హక్కానీ జాడ తెలియడం లేదు. అధ్యక్ష భవనంలో జరిగిన ఘర్షణలో బరాదర్‌ చనిపోయినట్టు , హక్కానీ గాయపడినట్టు తమ దగ్గర కచ్చితమైన సమాచారం అందని నార్తర్న్‌ అలయెన్స్‌ ప్రకటించింది.