Begin typing your search above and press return to search.
ఇంటికి వచ్చి మరీ డబ్బులు వసూలు చేస్తున్న తాలిబన్లు..
By: Tupaki Desk | 1 Nov 2021 12:30 AM GMTఅప్ఘనిస్తాన్ ను పాలిస్తున్న తాలిబన్లపై రోజుకో కథనం వెలువడుతోంది. తాలిబన్లు కొత్త వ్యవస్థను ఏర్పాటు చేశారని, ఇక్కడి ప్రజలను పీడిస్తున్నారని కొన్ని మీడియాలు కథనాలు చెబుతున్నాయి.లెటేస్టుగా రోడ్డుపై ప్రయాణించినా.. సరుకులు కొనడానికి బయటికొచ్చినా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొందరైతే ఇంటికి వచ్చి మరీ దౌర్జన్యం చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారని అంటున్నారు. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని స్థానిక మీడియాకు కొందరు తాలిబన్ అధికారులు అంటున్నారు. సరిహద్దుల్లో ఇతర ప్రాంతాల నుంచి వస్తువులకు వ్యాపార పన్ను మాత్రమే వసూలు చేస్తున్నామని ఇందులో వచ్చే సెస్ ను పేదలకు పంచిపెడుతున్నామని అంటున్నారు.
అప్ఘనిస్తాన్ లో పీఠంపై కూర్చున్న తాలిబన్లు తాము ప్రజలను హింసించమని, సాధారణ పాలనే కొనసాగిస్తామని ఇదివరకే చెప్పారు. కానీ కొన్ని చోట్ల తాలిబన్లు మాత్రం తమ రూల్స్ పాటించకపోతే నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నట్లు వార్తలు వస్తున్నారు. ఇప్పటికే కొన్ని నిబంధనలను చెప్పారు. అవి పాటించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా మహిళల విషయంలో తాలిబన్లు కొన్ని కఠినతరమైన నిబంధనలు పెట్టారు. బుర్ఖా లేకుండా మహిళలు రోడ్డుపైకి రావొద్దని అంటున్నారు. ఇక రోడ్డుపై వాహనాల్లో వెళితే మధ్యలో చెక్ పోస్టులు ఉంటాయని, అక్కడ క్షుణ్ణంగా తనిఖీ చేస్తారని అంటున్నారు. ఇందులో వాహనాల డ్రైవర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తారని అంటున్నారు. జోనాజ్ నుంచి అధ్ఖోయ్ వరకు 11 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు.
ఇక ఇంటింటికి వెళ్లి తాలిబన్లు డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు వారి ఆర్థిక పరిస్థితిని బట్టి డబ్బులు అందజేస్తున్నారు. లేకుంటే వారిపై దాడులు చేస్తున్నారు. ఇందులో కోసం తాలిబన్ పై అధికారులు కొందరిని నియమించుకున్నారు. వారితో ఈ పనులు చేయిస్తారు. ఇలా డబ్బులు వసూలు చేయడం వల్ల కొన్ని ప్రాంతాల వ్యాపారులు ఇళ్లకే పరిమితమవుతున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారుతోంది. ఇక కొందరు ధైర్యం చేసి షాపులు తెరిచిన వారు సాయంత్రం 5 గంటలకు మూసివేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. సూర్యుడు అస్తమించిన తరువాత కర్ఫ్యూ విధిస్తారు.
ప్రయాణించే వాహనాల్లో సంగీతాన్ని నిషేధించారు. స్మార్ట్ ఫోన్ల వినియోగం కూడా మానుకోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ‘ఒక్కోసారి జరిగే గొడవలు పెద్ద యుద్ధాన్నే తలపిస్తాయి. ఆ సమయంలో పిల్లలు చాలా భయపడిపోతారు. తాలిబన్లు గొడవతో దుకాణాలను ధ్వంసం చేస్తారు. గత తాలిబన్ పాలనలో పురుషులను అరెస్టు చేసేవారని’ స్థానిక మహిళలు పేర్కొంటున్నారు.
తాలిబన్ల రూల్స్ లో అమ్మాయిలు ఇంటికే పరిమితం కావాలనేది చాలా కఠినంగా ఉంటుంది. వారిని కాదని కళాశాలకు వెళితే ఏమాత్రం ఆలోచించకుండా చంపేస్తారు.గత తాలిబన్ల హయాంలో ఇది బాగా జరిగేంది. దీంతో ప్రస్తుతం కళాశాలల్లో చదివే అమ్మాయిలు ఇప్పుడు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కూరగాయలకు వెళ్లిన మహిళలను కూడా తాలిబన్లు వదలడం లేదు. వారితోఅసభ్యంగా ప్రవర్తిస్తూ వారిని తీవ్రంగా వేధిస్తున్నారు. ఒకవేళ వారికి ఎదురుతిరిగితే వారి భర్తలను లేదా ఇంట్లోని మొగవాళ్లను తీసుకెళ్లి జైలులో పెడుతున్నారు.
తాలబన్ల పాలన సాగడానికి డబ్బుల వసూళ్ల పర్వం మొదలు పెట్టారు. జోజాన్లోని కర్కాన్ జిల్లాలో 140 కిలోల గోధుమలో ఏడు కిలోలు తాలిబన్లే లాక్కుంటారు. అయితే ఈ మొత్తాన్ని అంతకుముందు పేదలకు లేదా మసీదుకు విరాళంగా ఇచ్చేవారు. కానీ ఇప్పుడు తాలిబన్లకే ఇవ్వాలని రైతులను డిమాండ్ చేస్తున్నారు. కానీ తాలిబన్ అధికారులు మాత్రం వేరే విధంగా చెబుతున్నారు. వారి నుంచి ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు సగం సెస్ మాత్రమే వసూలు చేస్తున్నామని, ఇక్కడ పాత పద్దతే నడుస్తోందని అంటున్నారు.