Begin typing your search above and press return to search.
ఆఫ్ఘనిస్ధాన్ స్వర్గదామమైపోయిందా ?
By: Tupaki Desk | 28 Aug 2021 6:32 AM GMTప్రపంచంలోని తీవ్రవాద, ఉగ్రవాద సంస్ధలకు ఆఫ్ఘనిస్థాన్ ఇపుడు స్వర్గదామమైపోయినట్లుగానే ఉంది. మొదటి నుండి ఈ దేశంలో తాలిబన్ల అరాచకాలు సృష్టిస్తునే ఉన్నారు. గతంలో ఐదేళ్ళపాటు దేశాన్ని పాలించినపుడు తాలిబన్లు ఎంత అరాచకాలను చేశారో యావత్ ప్రపంచం చూసింది. అలాంటిది 20 ఏళ్ల పౌర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశం కాస్త ప్రశాంతంగానే ఉంది. అలాంటిది ఇఫుడు మునుపటి అరాచకాలు మొదలైపోయాయి.
15 రోజుల క్రితం దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకోవడం మొదలుపెట్టినప్పటి నుంచి అరాచకాలు మళ్ళీ మొదలైపోయాయి. దీనికి ఉదాహరణ తాజాగా కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన మానవ బాంబు పేలుడే. గురువారం విమానాశ్రయంతో పాటు మరో హోటల్ లో జరిగిన మావన బాంబుల పేలుడు కారణంగా సుమారు 170 మందికి పైగా మరణించారు. మరో 130 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుళ్లకు కారకులు ఐఎస్ఐఎస్ (ఐసిస్) తీవ్రవాదులే అని నిర్ధారణ అయ్యింది. శుక్రవారం కూడా మరో 6 చోట్ల బాంబులు పేలాయి.
అంటే ఇప్పటికే అరాచక వాదులుగా పాపులరైన తాలిబన్లకు ఐసిస్ ఉగ్రవాదులు తోడయ్యారని అర్ధమవుతోంది. వీళ్ళు కాకుండా పాకిస్ధాన్లోని లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ తీవ్రవాద నేతలు, చైనా-ఆఫ్ఘనిస్ధాన్ లోని చైనాకు చెందిన ముస్లిం తీవ్రవాదులు కూడా దేశంలోకి ప్రవేశించినట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. తాలిబన్లకు మొదటినుండి పైన చెప్పుకున్న తీవ్రవాద సంస్థలన్నీ మద్దతుగానే ఉన్నాయట. కాకపోతే తాలిబన్లు-ఐసిస్ కు మధ్య అక్కడక్కడ ఆధిపత్యపోరు నడుస్తున్నట్లు కూడా అంతర్జాతీయ మీడియా ద్వారా తెలుస్తోంది.
ఏదేమైనా అమెరికా దాని మిత్రదేశాలకు వ్యతిరేకంగా తీవ్రవాదసంస్ధలన్నీ ఏకమైనట్లే ఉన్నాయి. అందుకనే ఆఫ్ఘన్ ఇపుడు సకల తీవ్రవాద సంస్ధలకు స్వర్గంలాగ అయిపోయిందంటున్నారు. తీవ్రవాదులంతా కలిసి ప్రావిన్సుల వారీగా పంచుకుని జనాలను పీక్కుతింటున్నారు. తమకు ఎదురు తిరిగిన వాళ్ళని కాల్చి చంపేయటం, అమ్మాయిల మీద హత్యాచారాలు చేయటం, ఇళ్ళను లూటీలు చేయటం యధేచ్చగా చేసేస్తున్నారు. ఎందుకంటే దేశంలో ఇపుడు ప్రత్యేకించి లా అండ్ ఆర్డర్ లేదు కాబట్టే. తీవ్రవాద సంస్ధలు ఏమి చెబితే దేశంలో అదే లా అండ్ ఆర్డర్. అందుకనే ఆఫ్ఘన్ కు మించిన స్వర్గం ప్రపంచంలో తీవ్రవాద సంస్ధలకు ఇంకోటుందా ?