Begin typing your search above and press return to search.

ఇండియాపై తాలిబన్ దాడి?: యుద్ధానికి మోడీ సిద్ధంగా ఉండాలి

By:  Tupaki Desk   |   17 Aug 2021 4:32 AM GMT
ఇండియాపై తాలిబన్ దాడి?: యుద్ధానికి మోడీ సిద్ధంగా ఉండాలి
X
అప్ఘనిస్తాన్ లో తాలిబన్ల రాజ్యం మొదలైంది. తాలిబన్లకు మన శత్రుదేశం పాకిస్తాన్, చైనాల నుంచి పూర్తి సహాయ సహకారాలు అందుతున్నాయి. కాబట్టి ఇండియాకు ఆ ముష్కరుల నుంచి ముప్పు తప్పదని.. కాబట్టి ముందస్తుగా మనమే యుద్ధానికి దిగాలని అధికార బీజేపీ నుంచే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

అప్ఘనిస్తాన్ లో తాలిబన్ల రాజ్యం మొదలుకావడంతో భారత్ కు తీవ్రమైన ముప్పు పొంచి ఉందని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి హెచ్చరించారు. చాలాకాలంగా అప్ఘాన్-తాలిబన్ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు.. లోతైన విశ్లేషణలు చేస్తోన్న సుబ్రహ్మణ్య స్వామి తాలిబన్ల తదుపరి టార్గెట్ భారత్ యేనన్నారు. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్రమోడీకి కీలక సూచనలు చేశారు.

అప్ఘాన్ లో అధికారాన్ని కైవసం చేసుకున్న తాలిబన్లు ఏడాది తిరిగేలోపు ఖతార్ పై దాడి చేస్తారని.. అందుకు పాకిస్తాన్, చైనాలు ఉపకరిస్తాయని స్వామి చెప్పారు. ఇండియాపై కూడా తాలిబన్ల దాడి తప్పదు కాబట్టే మనమే ముందుగా ఎదురుదాడి చేయాలని.. తాలిబన్ వ్యతిరేక శక్తులకు భారత్ లో ఆశ్రయం ఇవ్వడంతోపాటు నేరుగా తాలిబన్లతో యుద్ధాన్ని కూడా ప్రకటించాలని ప్రధాని మోడీని ఎంపీ స్వామీ కోరారు.

తాలిబన్లు మరో ఏడాదిలోనే భారత్ పై దాడికి దిగుతారని.. ఆ దిశగా పాకిస్తాన్, చైనాలు వారిని ఉసిగొల్పుతాయన్నారు. అందుకే భారత్ తప్పనిసరిగా తాలిబన్లతో యుద్ధం చేయాలని బీజేపీ ఎంసీ సుబ్రహ్మణ్యస్వామి కోరారు. తాలిబన్లతో యుద్ధం దిశగా ప్రధాని నరేంద్రమోడీ నిర్ణయం తీసుకోవాలని.. అఖండ భారత్ కావాలని కలగనే మనం భారతమాత కోసం ఇది తప్పక చేయాల్సిందే అని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.