Begin typing your search above and press return to search.
ఆ డిగ్రీలు చెల్లవన్న తాలిబన్లు .. సంచలన నిర్ణయం , అయోమయంలో స్టూడెంట్స్
By: Tupaki Desk | 5 Oct 2021 11:30 PM GMTఆప్ఘనిస్తాన్ లో అధికారాన్ని చేబట్టిన తాలిబన్లు రోజుకో విధమైన నిర్ణయం తో ప్రజలని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. తాలిబన్లు క్రమంగా దేశంలోని అన్ని వ్యవస్ధలపై పట్టు బిగిస్తున్నారు. ఇందులో భాగంగా విద్యారంగంలో భారీ మార్పులు తీసుకురానున్నారు. ఇప్పటికే దేశంలో షరియా చట్టాల్ని మాత్రమే అమలు చేస్తామని ప్రకటించిన తాలిబన్లు, ఇందుకోసం గతంలో ఆధునిక విద్య చదువుకున్న వారిని టార్గెట్ చేయబోతున్నారు. 2000 నుంచి 2020 మధ్య ఇలా ఆధునిక విద్య చదువుకున్న వారి డిగ్రీలు ఇక చెల్లవని తాలిబన్లు ప్రకటించారు.
ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్ల పాలన ప్రారంభమయ్యాక ప్రజాస్వామ్యం స్ధానంలో తిరిగి షరియా చట్టాల్ని అమలు చేస్తామని తాలిబన్లు స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగానే క్రమంగా అడుగులు పడుతున్నాయి. ప్రజాస్వామ్యం, ఆధునిక విద్యపై ఏమాత్రం నమ్మకం లేని తాలిబన్లు, దేశవ్యాప్తంగా వీటిపై నమ్మకం ఉన్న వారిని టార్గెట్ చేసే పనిలో ఉన్నారు. ముఖ్యంగా గత ప్రజా ప్రభుత్వాల పాలనలో ఆప్ఘనిస్తాన్ ఉన్న కాలంలో చదువుకున్న వారి చదువులు కూడా చెల్లుబాటు కావని తేల్చిచెప్పేస్తున్నారు. ప్రస్తుతం ఆప్ఘన్ లో ఉండి ఉద్యోగాలు చేయాలన్నా, అధికార పదవుల్లో ఉండాలన్నా తిరిగి షరియా చట్టాల ప్రకారం మదరసా విద్య అభ్యసించాల్సిందేనని తాలిబన్లు స్పష్టం చేశారు.
ఆప్ఘనిస్తాన్లో 2000 సంవత్సరంలో అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాల మద్దతు కలిగిన ప్రభుత్వాల పాలన ప్రారంభమైంది. అప్పటి నుంచి 2020 వరకూ అంటే గతేడాది వరకూ వివిధ యూనివర్శిటీలు, విద్యాసంస్ధల రాకతో పాటు పాశ్చాత్య విద్య కూడా అందుబాటులోకి వచ్చింది. దీంతో ఆప్ఘన్ లో యువత వీటిని అభ్యసించారు. వాటిలోనే డిగ్రీలు తీసుకున్నారు. ఈ రెండు దశాబ్దాల కాలంలో లక్షలాది మంది విద్యార్ధులు ఈ డిగ్రీలు తీసుకున్నారు. కానీ ఇప్పుడు వాటిని అంగీకరించేందుకు తాలిబన్లు ఇష్టపడటం లేదు. 2000 నుంచి 2020 మధ్య పట్టభద్రులైన వారి డిగ్రీలు ఇక చెల్లవని ప్రకటించారు. ఆప్ఘన్ లోని తాలిబన్ల విద్యాశాఖ మంత్రి అబ్దుల్ బకీ హక్కానీ దేశంలో విద్యారంగం గురించి తాజాగా కీలక ప్రకటన చేశారు. ఇందులో తాలిబనేతర ప్రభుత్వాల హయాంలో చదివిన చదువులకు కానీ, వాటి ద్వారా పొందిన డిగ్రీలు కానీ చెల్లుబాటు కావని స్పష్టం చేశారు.
తాలిబనేతర పాలనలో సాగిన ఆధునిక విద్య కంటే తాలిబన్ల పాలనలో అమలవుతున్న మదరసా విద్యే గొప్పదని కూడా ఆయన వెల్లడించారు. ఆప్ఘనిస్తాన్ లోని విశ్వవిద్యాలయాల అధ్యాపకులతో సమావేశమైన మంత్రి హక్కానీ.. దేశ సంస్కృతీ సంప్రదాయాలకు అనుగుణంగా బోధించే వారిని తీసుకోవాలని కూడా కోరారు. ఇప్పటికే తాలిబన్ల ప్రభుత్వ నిర్ణయం కారణంగా బాలికలు స్కూళ్లకు రావడం మానేశారు. షరియా చట్టాల ప్రకారం వారు బాలురతో కలిసి విద్యాభ్యాసం చేయడం నిషేధమని, అందుకే బాలికలను స్కూళ్లకు రప్పించడం లేదని తాలిబన్లు చెప్తున్నారు. ఇప్పుడు షరియా చట్టాల ప్రకారం మదరసా విద్యను ప్రోత్సహించేందుకు తాలిబన్లు ప్రయత్నిస్తున్నారు.
దీంతో బాలురకు విద్యాసంస్ధల్లో షరియా చట్టాల ప్రకారం మదరసా విద్య, బాలికలకు ఇంటి వద్దే మదరసా విద్యను అందించేందుకు తాలిబన్ల ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. తాలిబన్ల ప్రభుత్వం విద్యా సంస్కరణలు అమలు చేస్తుండంతో ఇప్పటివరకూ ఆధునిక విద్య బోధించిన విశ్వవిద్యాలయాలు ఇప్పుడు రూటు మార్చుకోవాల్సి వస్తోంది. దీంతో కొన్ని వర్శిటీలు బాలికల విద్యను రద్దు చేశాయి. మరికొన్ని విద్యాలయాలు మాత్రం ఆన్ లైన్ విద్య కొనసాగిస్తున్నాయి. వాటిలోనూ ఇబ్బందులు తప్పడం లేదు.