Begin typing your search above and press return to search.
మహిళా ఉద్యోగులకు తాలిబన్ల షాక్
By: Tupaki Desk | 19 July 2022 2:30 AM GMTఅప్ఘనిస్తాన్ లో తాలిబన్ల పాలన చేపట్టినప్పటి నుంచి మహిళలకున్న హక్కులన్నీ కాలరాశారు. వారికి స్వేచ్ఛ లేకుండా చేశారు. దేశంలోని మహిళలకు చదువు, దుస్తులు వంటి అనేక విషయాలపై రకరకాల ఆంక్షలు విధించారు. ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.
గద్దెనెక్కక ముందు మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పిన తాలిబన్ల హామీలు నీటిమూటగా మారాయి. టీవీ యాంకర్లపైనా తాలిబన్లు ఆంక్షలు విధించారు. వార్తల ప్రసార సమయాల్లో మహిళా టీవీ యాంకర్లు తమ ముఖాలు కనిపించకుండా కప్పుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.తాలిబన్లు ఇచ్చిన ఆదేశాలకు ఎదురుచెప్పే పరిస్థితి కానీ.. వాటిపై బహిరంగంగా చర్చించే పరిస్థితి కానీ మహిళా యాంకర్లకు లేకుండా పోయింది. దీంతో తప్పనిసరి పరిస్తితుల్లో మహిళా యాంకర్లు కూడా ముఖాలకు మాస్కులు ధరించి ప్రసారాలను కొనసాగిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను కొందరు యాంకర్లు సోషల్ మీడియాలో పంచుకున్నారు అవి వైరల్ అయ్యాయి.
ఇక మహిళల ఉద్యోగాలపైనా తాలిబన్ల ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అప్ఘన్ మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయడాన్ని తాలిబన్ ప్రభుత్వం నిలిపివేసింది. అప్ఘన్ లోని కాబూల్, ఇతర ప్రావిన్స్ లలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ జారీని నిలిపివేసినట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఈ మేరకు డ్రైవింగ్ టీచర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.
తాజాగా తాలిబన్లు మరోసారి ఇలాంటి పనే చేసింది.మ హిళా ఉద్యోగులను ఆఫీసుకు రావద్దని, వారి స్థానంలో కుటుంబం నుంచి లేదా సమీప బంధువుల్లోని మగాళ్లను పంపాలని ఆదేశించింది. ఈ మేరకు ఓ మహిళా ఉద్యోగి వెల్లడించారు.
తాలిబన్లు తీరుపై మహిళా ఉద్యోగి వాపోయారు. రూ.60వేలు ఉన్న నా జీతాన్ని 12 వేలు చేశారని.. ఇదేంటని మాపై అధికారిని అడిగితే దురుసుగా ప్రవర్తించారని.. ఆఫీస్ నుంచి బయటకు వెళ్లిపోమన్నారని.. ఈ విషయంపైచర్చించవద్దన్నారు. జీతం తగ్గాక నా పిల్లాడికి స్కూల్ ఫీజు కూడా కట్టలేని దుస్తితి వచ్చిందని.. 15 ఏళ్లుగా ఆర్థిక శాఖలో పనిచేస్తున్నానని.. కానీ ఇప్పుడు నా స్థానంలో తెలిసిన పురుషుడిని పంపాలని చెప్పారు.
తాలిబన్లు అధికారంలోకి వచ్చాక మహిళల హక్కులను కాలరాస్తున్నారు. వారిపై కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. తాలిబన్ల తీరును అంతర్జాతీయ సమాజం కూడా తీవ్రంగా తప్పుపట్టింది.