Begin typing your search above and press return to search.
అతని నేతృత్వంలో తాలిబన్ల పై తిరుగుబాటు !
By: Tupaki Desk | 18 Aug 2021 8:30 AM GMTప్రస్తుతం అఫ్ఘనిస్థాన్‌లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ప్రపంచం మొత్తం తెలుసు. తాలిబన్లు.. అఫ్ఘాన్ మొత్తాన్ని హస్తగతం చేసుకున్నారు. అఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం త్వరలో ఏర్పడుతుందని కూడా ప్రకటించారు. తాలిబన్లకు లొంగిపోయి అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. దీంతో అఫ్ఘాన్ కొత్త ప్రెసిడెంట్‌గా తాలిబన్ కోఫౌండర్ ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్‌ను త్వరలోనే అఫ్ఘాన్ ప్రెసిడెంట్‌గా తాలిబన్లు ప్రకటించనున్నారు.
అయితే, ఈ నేపథ్యంలో అమ్రుల్లా సలేహ్ ఆధ్వర్యంలో తాలిబన్లపై తిరుగుబాటు జరిగింది. తాలిబన్లతో జరిగిన పోరులో చారికర్ ప్రాంతాన్ని అఫ్ఘాన్ ఆర్మీ స్వాధీనం చేసుకున్నారు. కాగా, పంజ్‌షేర్ ప్రాంతంలో అఫ్ఘాన్ ఆర్మీ దాడులు కొనసాగుతున్నాయి. పంజ్‌షీర్ ప్రాంతంలోని తాలిబన్లపై కూడా ఆప్ఘన్ సైన్యం తిరుగుబాటును కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ తాను తాలిబన్లకు లొంగిపోయే ప్రసక్తే లేదన్న వైస్ ప్రెసిడెంట్ అమ్రుల్లా సలేహ్ తనకు మద్దతు ఇవ్వాలని నేతలను కోరుతున్నారు.
ఇక ఇదిలా ఉంటే .. అఫ్గనిస్తాన్‌ను వశం చేసుకున్న అనంతరం తాలిబన్లు తొలిసారి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ 20 ఏళ్ల తర్వాత విదేశీ సైన్యాన్ని తరిమికొట్టాం. అంతర్గతంగా, బయట నుంచి శత్రుత్వం కోరుకోవడంలేదు. మహిళల హక్కులకు ఎలాంటి భంగం కలగనివ్వం, అని పేర్కొన్నారు. తాము అందరినీ క్షమించామని, ఎవరి మీదా ప్రతీకారం ఉండదని తేల్చి చెప్పారు. ప్రజల ఇళ్లలో సోదాలు, దాడులు ఉండవని వెల్లడించారు. అదే విధంగా...అఫ్గన్ లో ఇతర దేశీయులకు హాని తలపెట్టబోము. కాబూల్ ఎయిర్ పోర్ట్ లో ఉన్నవారు వెనక్కి రావాలి. ఇస్లామిక్ చట్టాల ప్రకారం మహిళలకు అన్ని హక్కులు కల్పిస్తాం. ఎలాంటి వివక్ష చూపబోం. వైద్య, ఇతర రంగాలలో వారు పనిచేయవచ్చు. అలాగే మీడియాపై ఎలాంటి ఆంక్షలు విధించం అని ముజాహిద్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు స్థానిక టోలోన్యూస్ తో మాట్లాడుతూ తాము అవలంబించబోయే వైఖరి గురించి మంగళవారం వెల్లడించారు.
అలాగే అన్ని మీడియా సంస్థలు తమ కార్యకలాపాలను కొనసాగించాలని కోరుకుంటున్నామని ముజాహిద్ తెలిపారు. అయితే మీడియాకు మూడు కీలక సూచనలు చేశారు. ‘‘ఏ ప్రసారమూ ఇస్లామిక్ విలువలకు విరుద్ధంగా ఉండకూడదు. నిష్పక్షపాతంగా ఉండాలి. జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా ఏదీ ప్రసారం చేయకూడదని సూచించారు. ప్రజల జీవనోపాధిలో మెరుగుదలకు కృషిచేస్తాం’’ అని చెప్పారు.